యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) డిఫరెంట్ కథలతో ముందుకెళ్తున్నారు. ఆయన హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari). ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే చిత్రాన్ని సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉషా మూల్పూరి ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
నాగశౌర్య మొదట కథ విన్నారు. కథ చాలా బావుంది. ఈ సినిమాను పాండమిక్ లోనే స్టార్ట్ చేశాం. ‘కృష్ణ వ్రింద విహారి' కమర్షియల్ ఎంటర్ టైమెంట్ ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్ వేర్, ఇలా అన్ని ఎలిమెంట్స్ కి కనెక్ట్ అయ్యాం అని ఉషా మూల్పూరి అన్నారు.
ఈ సినిమాలో ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిన్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో నాగశౌర్యని చూస్తారు. శౌర్య కెరీర్లో ‘కృష్ణ వ్రింద విహారి' ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. మొదట అనుకున్న విడుదల తేది పాండమిక్ కారణంగా అన్నీ సినిమాల్లానే ముందు వెనుక అయ్యింది. అయితే మంచి సినిమా.. మంచి డేట్ చూసి రావాలని భావించాం. మంచి డేట్ కోసం ఎదురుచూశాం. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అని చెప్పారు.
టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత వుంది. షిర్లీ సెటియా ఆ కొరతని తీరుస్తుందనే నమ్మకం వుంది. చాలా మంచి నటి. అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. ఇందులో హీరోయిన్ పేరు వ్రిందా. హీరో పేరు కృష్ణ. అందుకే చిత్రానికి కృష్ణ వ్రిందా విహారి అనే టైటిల్ పెట్టాం అని ఉషా మూల్పూరి చెప్పారు.
కృష్ణ వ్రిందా విహారి తర్వాత కొన్ని ప్రాజెక్టులు లైనప్లో ఉన్నాయి. కొన్ని కథలు కూడా విన్నాం. కాకపోతే ఇప్పుడు కొత్త సినిమా ఆలోచన లేదు. ఈ సినిమాను విడుదల చేయడం నిండు గర్భిణి బిడ్డని కనడం లాగా ఉంది. ఈ సినిమా తర్వాతే మరో బిడ్డ లాంటి సినిమా గురించి ఆలోచిస్తాం అని ఉషా మూల్పూరి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.