Home /News /movies /

NAGA SHAURYA KRISHNA VRINDA VIHARI MOVIE TEASER RELEASED AND ITS FILLED WITH FULL OF ROMANCE PK

Krishna Vrinda Vihari teaser: ‘కృష్ణ విృందా విహారి’ టీజర్.. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో వచ్చేస్తున్న నాగ శౌర్య..

కృష్ణ వృిందా విహారి టీజర్ (krishna vrinda vihari)

కృష్ణ వృిందా విహారి టీజర్ (krishna vrinda vihari)

Krishna Vrinda Vihari teaser: ఛలో (Chalo) లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత నాగ శౌర్యకు (Naga Shaurya) ఇప్పటి వరకు మరో విజయం రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు చేసాడు కానీ అవి అంచనాలు అందుకోలేదు. అశ్వద్ధామ, వరుడు కావలెను (Varudu Kavalenu) లాంటి సినిమాలు యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి.

ఇంకా చదవండి ...
ఛలో (Chalo) లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత నాగ శౌర్యకు (Naga Shaurya) ఇప్పటి వరకు మరో విజయం రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు చేసాడు కానీ అవి అంచనాలు అందుకోలేదు. అశ్వద్ధామ, వరుడు కావలెను (Varudu Kavalenu) లాంటి సినిమాలు యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి. గతేడాది వచ్చిన లక్ష్య (Lakshya) దారుణంగా డిజాస్టర్ అయింది. ఇలాంటి సమయంలో ఈయన నటిస్తున్న సినిమా ‘కృష్ణ విృందా విహారి’ (Krishna Vrinda Vihari). అనీష్ కృష్ణ (Anish R Krishna) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా లవర్ తెరకెక్కించిన ఈయన.. ఇప్పుడు నాగశౌర్యతో సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘కృష్ణ విృందా విహారి’ టీజర్ విడుదలైందిప్పుడు. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సారి పూర్తిగా రొమాంటిక్ సినిమాతోనే వచ్చేస్తున్నాడు శౌర్య.

దీన్ని తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లోనే చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఉషా మల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్రిల్ 22న థియేటర్స్‌లో విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కావడంతో టీజర్‌లో కాస్త డోస్ పెంచేసాడు దర్శకుడు అనీష్. నాగశౌర్య, హీరోయిన్ షెర్లీ సేటియా మధ్య రొమాన్స్ ఘాటుగానే కనిపిస్తుంది. టీజర్‌లో మెయిన్‌గా రొమాంటిక్ సన్నివేశాలను బాగా హైలైట్ చేసాడు దర్శకుడు. యూత్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ చిత్రంతో కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు నాగ శౌర్య.

‘కృష్ణ విృందా విహారి’ టైటిల్ కూడా క్యాచీగా ఉండటంతో నమ్మకంగా ఉన్నారు యూనిట్. కెరీర్ మొదట్లో వరస హిట్స్ కొట్టిన శౌర్య.. ఆ తర్వాత జోరు చూపించలేకపోతున్నాడు. అప్పట్లో ఈయన నటించిన కళ్యాణ వైభోగమే, ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్చుతానంద లాంటి సినిమాలు విజయం సాధించాయి. ఆ తర్వాత ఛలో సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో మార్కెట్ కూడా పెంచుకున్నాడు ఈయన. అయితే ఆ తర్వాత మాత్రం తడబడుతున్నాడు. ఎన్ని సినిమాలు చేసినా కూడా కోరుకున్న ఫలితం మాత్రం రావడం లేదు. మరి ప్రస్తుతం ‘కృష్ణ విృందా విహారి’ సినిమాతో అయినా శౌర్య కష్టాలు తీరుతాయో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Naga shaurya, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు