Home /News /movies /

Naga Shaurya : అదిరిన నాగశౌర్య లక్ష్య ట్రైలర్.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్...

Naga Shaurya : అదిరిన నాగశౌర్య లక్ష్య ట్రైలర్.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్...

Naga Shaurya Photo : Twitter

Naga Shaurya Photo : Twitter

Naga Shaurya : హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ లక్ష్య. ఈ సినిమా డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రం. ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొడుతున్నారు.

ఇంకా చదవండి ...
    టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య   (Naga Shaurya) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ లక్ష్య. ఈ సినిమా డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రం. ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొడుతున్నారు. ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న (Lakshya Trailer) ఈ లక్ష్య సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ హీరోయిన్, కేతిక శర్మ హీరోయిన్‌గా (Ketika Sharma )నటించింది. ఇక ఈ సినిమాకు గాను నాగశౌర్య చేసిన బాడీ మేకోవర్ మంచి హైప్ ను క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే... ఈ సినిమా మొత్తం ఆర్చరీ చుట్టూనే తిరుగుతున్నట్లు కనబడుతోంది. విజువల్స్ బాగున్నాయి. దీనికితోడు కాల భైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. వచ్చే డిసెంబర్ 10న థియేటర్స్‌లో విడుదలకానున్న ఈ చిత్రం ఏ మేరకు తెలుగువారిని ఆకట్టుకోనుందో చూడాలి.

    ఇక నాగశౌర్య ఇతర సినిమాల విషయానికి వస్తే.. అశ్వథ్థామతో మంచి హిట్ అందుకున్న నాగశౌర్య.. తాజాగా వరుడు కావలను ఫ్యామిలీ డ్రామాతో వచ్చారు. ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నాగశౌర్యకు జోడిగా పెళ్లి చూపులతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా చేసింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

    Ileana D'Cruz : ఇలియానా అరాచకం.. అర్ధనగ్న అందాలతో రెచ్చగొట్టిన గోవా బ్యూటీ..

    ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు. ఈ సినిమాలోని దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' (digu digu digu naaga song) అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు.


    థమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నాగశౌర్య, రీతువర్మ హీరో, హీరోయిన్స్‌గా నటించగా... నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Ketika sharma, Naga shaurya, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు