క్లాస్ ఇమేజ్‌తో ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చిన నాగ శౌర్య.. తొలిసారి పూర్తిస్థాయి మాస్ సినిమా చేసాడు. అదే అశ్వథ్థామ.. ఏ దర్శకుడు తన దగ్గరికి మాస్ కథలు తీసుకురావడం లేదని కూర్చుని తానే రాసుకున్నాడు ఈ కథ. ఈ సినిమా ఇప్పుడు విడుదలైంది. మరి అశ్వథ్థామ ఎలా ఉన్నాడు.. ఆకట్టుకున్నాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి యుఎస్ ప్రీమియర్స్ పడిపోయాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం.. అశ్వథ్థామ సినిమాతో నాగశౌర్య అనుకున్నంతగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది. తెలిసిన కథే కావడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా నాసీరకంగానే ఉండటంతో అశ్వథ్థామ అంతగా రుచించలేదని తెలుస్తుంది.
కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం బాగున్నాయని.. ఆరంభం చాలా రొటీన్ అనిపించినా ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్స్ మాత్రం ఆకట్టుకుంటాయని.. సమాజంలో బర్నింగ్ ఇష్యూను తన సినిమాలో చూపించాడని చెబుతున్నారు ఆడియన్స్. మరోవైపు ఈ చిత్రం చూస్తుంటే రాక్షసుడు సినిమా గుర్తుకొస్తుంది. ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు అంటారన్నట్లు.. ఇండస్ట్రీలో కూడా సినిమాలను పోలిన సినిమాలు చాలానే ఉంటాయి. ఇప్పుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న అశ్వథ్థామను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది.
ట్రైలర్‌లోనే కొన్ని చూపించాడు.. సేమ్ టూ సేమ్ అమ్మాయిలు కిడ్నాప్.. ఆ తర్వాత చంపడం.. క్లూ లేకుండా పోలీసులు చేతులెత్తేయడం.. అలాంటి సమయంలో హీరో వచ్చి దాన్ని చేధించడం అన్నీ రాక్షసుడు సినిమాను పోలి ఉన్నాయి. కథనంలో మాత్రం కాస్త భిన్నంగా ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు రమణ తేజ. అయితే నాగశౌర్య కోరుకున్న హిట్ మాత్రం వస్తుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. 2018లో ఛలో సినిమాతో హిట్ కొట్టిన తర్వాత ఇప్పటి వరకు ఈయనకు మరో విజయం రాలేదు. ఇప్పుడు అశ్వథ్థామ సినిమాతో వచ్చాడు. వరల్డ్ వైడ్‌గా భారీగానే విడుదలైంది ఈ చిత్రం. మొత్తానికి ఈ చిత్ర ప్రీమియర్ షో టాక్ మాత్రం అంతగా రాలేదు.. మరి ఇండియాలో షోస్ పడిన తర్వాత రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga shourya, Telugu Cinema, Tollywood