నాగశౌర్య, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన సినిమా అశ్వథ్థామ. ఇప్పటి వరకు కేవలం లవర్ బాయ్‌గా మెప్పించిన శౌర్య.. తొలిసారి పూర్తిస్థాయి మాస్ హీరోగా నటించాడు. కొత్త దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ చిత్రానికి తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ మాత్రం పర్లేదు అనిపించేలా వచ్చాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందంటూ పోస్టర్స్ విడుదల చేసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రాన్ని 7 కోట్లకు అమ్మారు. 8 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. ఇప్పటి వరకు మూడు రోజుల్లో దాదాపు 5 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు తెలుస్తుంది. మరో మూడు కోట్లు వస్తే కానీ నాగశౌర్య హిట్ కొట్టినట్లు కాదు. వీకెండ్ బాగానే క్యాష్ చేసుకున్నాడు ఈ హీరో.
Get yourself a shot of action and seat edge thriller #Aswathama this weekend, Mints 10.35 Cr gross in 3 days...
— BARaju (@baraju_SuperHit) February 3, 2020
Theatrical rights were sold for 6.5 Cr..Almost all areas will get break even in short time
Best in @IamNagashaurya career https://t.co/F8mSMcYS6P pic.twitter.com/pQfdCuXXdU
వీక్ డేస్‌లో అశ్వథ్థాముడు ఎలా పర్ఫార్మ్ చేస్తాడనే దాన్ని బట్టే ఈ చిత్ర విజయం ఆధారపడి ఉంది. ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ అల వైకుంఠపురములో సందడి కనిపిస్తుంది. దాంతో ఈ చిత్రం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కాబట్టి వదలకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు నాగశౌర్య అండ్ టీం. నాగశౌర్య మాస్ హీరోగా బాగానే చేసాడు.. కథ కూడా బాగానే ఉంది కానీ కథనం మాత్రం తేడా కొట్టేసింది. అయినా కూడా ఓపెనింగ్స్ వరకు సత్తా చూపించాడు అశ్వథ్థామ. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ఆకర్షణ. ప్రస్తుతానికి కలెక్షన్స్ పర్లేదు అనిపించినా తర్వాత ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి చూడాలిక.. రాబోయే రోజుల్లో అశ్వథ్థామ ఏం చేయబోతున్నాడో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga shourya, Telugu Cinema, Tollywood