NAGA CHAITANYASAMANTHAS MAJILI MOVIE CREATES NEW RECORD AT BOX OFFICE THE FILM TO ENTER RS 100 CRORE CLUB VERY SOON TA
సమంత తోడుగా నాగ చైతన్య మరో రికార్డు..త్వరలో రూ.100 కోట్ల ’క్లబ్బులో ‘మజిలీ’..
నిన్నుకోరి లాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా మజిలీ. సమంత, నాగ చైతన్య జంటగా వచ్చిన ఈ సినిమాకు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో 25 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం దాదాపు 37 కోట్ల వరకు షేర్ వసూలు చేసి సూపర్ హిట్ అనిపించుకుంది.
అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. 11 రోజుల్లోనే ఈ చిత్రం 35 కోట్ల వరకు షేర్ రూ. 53 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇదే ఊపు కొనసాగితే..‘మజిలీ’ తొందర్లనే రూ.100 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకలు.
అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. 11 రోజుల్లోనే ఈ చిత్రం 35 కోట్ల వరకు షేర్ రూ. 53 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్ల లాభాల బాట పట్టింది మజిలీ. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రూ.28 కోట్లకు పైగానే వసూలు చేసింది ఈ చిత్రం. ఇక్కడ 16 కోట్లకు సినిమాను అమ్మేసారు. ఇప్పటికే పెట్టుబడి చాలా చోట్ల వెనక్కి వచ్చేయడమే కాకుండా లాభాలు తీసుకొచ్చింది మజిలీ. ఏడో రోజు కూడా నైజాంలో కోటి రూపాయల షేర్ వసూలు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రూ. 50 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన ఈ సినిమా ఈ ఊపును కంటిన్యూ చేస్తే త్వరలో రూ.100 కోట్ల క్లబ్బులో చేరడానికి ఎంతో టైమ్ పట్టదు. సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ విడుదలైన ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ‘మజిలీ’ కలెక్షన్ల ప్రవాహం ఆగడం లేదు.
50 కోట్ల క్లబ్లో నాగచైతన్య, సమంత మజిలీ..
మరోవైపు ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం రప్ఫాడిస్తుంది. అక్కడ ఇప్పటికే 4.5 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు నాగచైతన్యకు తోడుగా సమంతను కూడా తీసుకొచ్చాడు. దాంతో ఈ భార్యాభర్తల బంధాన్ని చూడ్డానికి థియేటర్స్ వైపు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు.
మజిలీ సక్సెస్ మీట్లో నాగ చైతన్య, సమంత
శైలజా రెడ్డి అల్లుడు జస్ట్ ఓకే అనిపించడంతో ఇప్పుడు మజిలీ సినిమాతో కోరుకున్న విజయాన్ని అందుకున్నాడు చైతూ. కాస్త స్లోగా ఉందనే టాక్ వచ్చినా కూడా చైతూ, స్యామ్ మ్యాజిక్ మజిలీకి బాగానే పనికొస్తుంది. తొలి వీకెండ్ అంతా మజిలీ హవానే కనిపించింది. అంతేకాదు రెండో వారంలో కూడా ‘మజిలీ’ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. నిన్ను కోరి లాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ఇది. చాలా ఏళ్ళ తర్వాత నాగ చైతన్యకు వచ్చిన బ్లాక్ బస్టర్ ఇది. మొత్తానికి రూ. 50 కోట్ల క్లబ్బులో చేరిన ‘మజిలీ’ బాక్సీఫీస్ దగ్గర ఎంత మేరకు తన కలెక్షన్ల మజిలీని పూర్తి చేసుకుంటుందో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.