‘మజిలీ’ అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ ఫిక్స్..

పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మజిలీ’ సినిమా ఫస్ట్ డే మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ‌తో దూసుకుపోతుంది.తాజాగా ఈ సినిమా అమెజాన్‌లో విడుదలయ్యే రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 7, 2019, 6:22 PM IST
‘మజిలీ’ అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ ఫిక్స్..
మజిలీ సినిమా
  • Share this:
పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మజిలీ’ సినిమా ఫస్ట్ డే మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ‌తో దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత నాగచైతన్య ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగచైతన్యకు భార్య సమంత తోడుగా మంచి హిట్ దొరికింది. ఇప్పటికే రెండు రోజుల్లో రూ. 21 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా..రూ.13 కోట్ల షేర్‌‌ను వసూలు చేసింది. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతన్న ఈసినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్‌ వాళ్లు మంచి రేటుకే దక్కించుకున్నారు. ఒకవైపు థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ సినిమాలకు అమెజాన్ వంటి దాంట్లో ప్రసారం కావడం నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి ఏప్రిల్ 1వ తేది నుంచి అమెజాన్ ప్రైమ్‌ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ సంస్థలతో పాటు శాటిలైట్ ఛానెల్స్‌కు 60 రోజుల తర్వాతే కొత్త సినిమాలను ప్రసారం చేసే విధంగా టాలీవుడ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు.

naga chaitanya,samantha's majili movie amazon prime release date fix,majili,majili movie,majili songs,majili review,majili movie review,majili naga chaitanya samantha,majili amazon prime,majili movie release in amazon prime,majili trailer,majili public talk,majili pre release event,majili telugu movie,majili movie trailer,majili movie public talk,majili movie songs,#majili,majili theatrical trailer,majili video songs,majili pre release,majili songs jukebox,majili naga chaitanya,majili public response,majili review and rating,majili talk,majili teaser,tollywood news,telugu cinema,నాగ చైతన్య,సమంత,మజిలీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ రివ్యూ,మజిలీ అమెజాన్ ప్రైమ్,అమెజాన్ ప్రైమ్‌ లో మజిలీ మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
మజిలీ పోస్టర్ Photo: Twitter


ఈ నిర్ణయం తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న మొదటి సినిమా ‘మజిలీ’నే. ఉగాది కానుకగా విడులైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 4వ తేదిని ప్రసారం కానుంది. మరి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాను అమెజాన్‌లో చూడాలనుకునే వారు రెండు నెలలు వెయిట్ చేయాల్సిందే. లేకపోతే థియేటర్స్‌ వెళ్లి బొమ్మా చూడటం తప్పించి మరో ఆప్షన్ లేదు.

 

First published: April 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...