‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల ఇంత వరకు ఏ సినిమా చేయలేదు. చేస్తే ఏ కథానాయకుడితో చేస్తాడా అని అందరు ఎంతో ఆసక్తి ఎదురు చూసారు. తాజాగా ఆ ఎదురు చూపులు ఫలించాయి. శేఖర్ కమ్ముల తన నెక్ట్ చిత్రాన్ని అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కించబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. గత కొంత కాలంగా వీళ్లిద్దరి కలయికలో సినిమా వస్తుందన్న వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుతూ ఈ ప్రకటన చేసారు. అంతేకాదు అక్కినేని నాగ చైతన్యతో శేఖర్ కమ్ముల తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ‘ఫిదా’ భామ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇందులో నటించే మిగతా నటీనటులు సాంకేతిక నిపుణులు ఎవరనే విషయాన్ని త్వరలో ప్రకటించనున్నారు.

శేఖర్ కమ్ముల,నాగ చైతన్య (ట్విట్టర్ ఫోటోస్)
ఇక గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్‌లేని నాగ చైతన్య.. ఈ యేడాది తన భార్య సమంతతో కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇపుడు అదే ఊపులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక లవబుల్ ఎంటర్టేనర్ చేయనున్నాడు. మరి ఈ మూవీ అక్కినేని నాగ చైతన్య కెరీర్లో మరో మజిలీగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.