Samantha - Naga Chaithanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన అందం, నటనతో మంచి ఫాలోయింగ్ అందుకుంది ఈ బ్యూటీ. ఇక నాగచైతన్య తో పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా అస్సలు తగ్గట్లేదు ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
సినిమాలలోనే కాకుండా వాణిజ్యపరమైన ప్రకటనలో కూడా బాగా బిజీగా ఉంటుంది సమంత. నాగచైతన్య తో కలిసి సినిమాలే కాకుండా పలు యాడ్స్ కూడా చేసింది. ఇప్పటివరకు సమంత మంచి సక్సెస్ తోనే ముందడుగు వేసింది. ఇదిలా ఉంటే కొన్ని ఫోటో షూట్ లతో కూడా సమంత తన గ్లామర్ తో బాగా రెచ్చిపోతుంది. అంతేకాకుండా ప్రతిరోజు యోగ, వర్క్ ఔట్ లతో కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తుంది సమంత. ఇక నాగచైతన్య తో గొడవల గురించి కొన్ని నిజాలు బయట పెట్టింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం సమంత 'ది ఫ్యామిలీ మెన్ 2' వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకుల ముందుకు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జరుగుతున్న సందర్భంగా తాజాగా సమంత అభిమానులతో కొన్ని విషయాలు పంచుకుంది. ప్రతి వ్యక్తికి తమ ఇష్టాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యమని, తమను తాము ప్రేమించుకున్నప్పుడే జీవితం అందంగా ఉంటుందని తెలిపింది.
ఇక తన కళ్ళు, నవ్వు, శరీర బలం అంటే ఇష్టమని ఈ మూడు లక్షణాలు తనకు ఇష్టమని తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయాలని తెలిపింది. దాని వల్ల మరింత ఉత్సాహంగా ఉండగలమని పేర్కొంది. ఇక నాగ చైతన్య గురించి కొన్ని విషయాలు తెలుపుతూ తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయని తెలిపింది.కానీ ప్రతిసారి కాంప్రమైజ్ అయ్యేది మాత్రం తానే అని నిజాన్ని బయట పెట్టింది. ఇక ప్రస్తుతం తన ఖాతాలో శాకుంతలం సినిమా ఉండగా ఈ సినిమా కోవిడ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.