పోటా పోటీగా బాలీవుడ్ సినిమాల్లో నాగ చైతన్య, నితిన్..

అవును.. నాగ చైతన్య, నితిన్ ఇద్దరూ కూడా పోటా పోటీగా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలపై పడ్డారు. వీళ్లిద్దరు కూడా హిందీలో ఒక హీరో నటించిన సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: September 11, 2019, 10:09 AM IST
పోటా పోటీగా బాలీవుడ్ సినిమాల్లో నాగ చైతన్య, నితిన్..
నాగ చైతన్య, నితిన్ (Facebook/Photo)
  • Share this:
అవును.. నాగ చైతన్య, నితిన్ ఇద్దరూ కూడా పోటా పోటీగా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలపై పడ్డారు. వీళ్లిద్దరు కూడా హిందీలో ఒక హీరో నటించిన సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. వివరాల్లోకి వెళితే.. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో  ఉంది. గత  కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రీమేక్‌లు సూపర్ హిట్ అవ్వడమే కాదు..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా గతేడాది బాలీవుడ్‌లో సూపర్ హిట్టైన ‘బదాయి హో’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయింది. ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నాడు. ఈ రీమేక్‌లో నాగ చైతన్య హీరోగా నటించే అవకాశాలున్నాయి.

naga chaitanya will act in bollywood super hit remake ayushman  khurana badai ho,naga chaitanya,naga chaitanya akkineni,nithin,nithiin,nithiin naga chaitanya,nithiin twitter,nithiin instagram,nithiin facebook,naga chaitanya instagram,naga chaitanya twitter,naga chaitanya facebook,naga chaitanya nithiin bollywood super hit remakes,naga chaitanya ayushma khurana badhaai ho,naga chaitanya  remake badhaai ho telugu remake,nithiin ayushma khurana,ayushman khurana,nithiin remake Andhadhun,bollywood,tollywood,నితిన్,నాగ చైతన్య,ఆయుష్మాన్ ఖురానా,నితిన్ అంధాధున్ తెలుగు రీమేక్,నాగ చైతన్య బదాయి హో తెలుగు రీమేక్,బదాయి హో తెలుగు రీమేక్‌లో నాగ చైతన్య,అంధాదున్ తెలుగు రీమేక్ లో నితిన్,బాలీవుడ్,టాలీవుడ్,
‘బదాయి హో’ తెలుగు రీమేక్‌లో నాగ చైతన్య (facebook/Photo)


తెలుగులో ఈ రీమేక్ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి. త్వరలోనే ఈ విషయమైన అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. మరోవైపు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన మరో సూపర్ హిట్ ‘అంధాదున్’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి నితిన్ ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ సినిమాలో నటనకు గాను ఆయుష్మాన్ ఖురానా జాతీయ స్థాయిలో ఉత్తమనటుడు అవార్డును దక్కించుకున్నాడు.

అంధాదున్ తెలుగు రీమేక్‌లో నితిన్ (Facebook/Photo)


తెలుగులో ఈ సినిమాను రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించే అవకాశాలున్నాయి. ఈ రకంగా పోటా పోటిగా నాగ చైతన్య, నితిన్‌ ఇద్దరూ ఆయుష్మాన్ ఖురానా నటించిన సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేయడం యాదృచ్ఛికమే అని చెప్పాలి.
First published: September 11, 2019, 10:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading