• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAGA CHAITANYA VIKRAM KUMAR FILM LATEST UPDATE SR

విక్రమ్ కుమార్ నాగ చైతన్య సినిమాకు టైటిల్ ఫిక్స్...

విక్రమ్ కుమార్ నాగ చైతన్య సినిమాకు టైటిల్ ఫిక్స్...

నాగ చైతన్య, విక్రమ్ కుమార్ Photo : Twitter

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'దిల్' రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు.

  • Share this:
    Naga Chaitanya : నాగ చైతన్య తాజాగా దగ్గుబాటి వెంకటేష్‌తో కలిసి నటించిన 'వెంకీ మామా' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే  చాలావరకు లవ్ స్టోరీ షూటింగ్ జరపుకుంది. సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. దీంతో ఆ మధ్య సినిమాలో ఓ ప్రోమో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అది అలా ఉంటే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. 'లవ్ స్టోరీ' తర్వాత మరో రెండు సినిమాలకు ప్లాన్ చేశాడు చైతూ.. అందులో భాగంగా ఆయన 'బంగార్రాజు' 'నాగేశ్వరరావ్' సినిమాల్లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత వచ్చే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. 'దిల్' రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.

    Naga Chaitanya thank you, Naga Chaitanya Vikram Kumar film update,Naga Chaitanya to work with Vikram Kumar,Naga Chaitanya new movies,akhil new movie, akhil latest news, vikram kumar movies, akhil vikram kumar movie,naga chaitanya sai pallavi shekhar kammula,sekhar kammula,naga chaitanya movies,director shekar kammula,shekar kammula movies,naga chaitanya full movies,director sekhar kammula,naga chaitanya latest movies,shekar kammula speech,naga chaitanya sai pallavi sekhar kammula new movie,akkineni naga chaitanya,shekar kammula next movie,sekhar kammula movies,director sekhar kammula movies,kammula,shekar kammula naga chaitanya,Sekhar Kammula twitter,Sekhar Kammula instagram,Sekhar Kammula facebook,tollywood,telugu cinema,శేఖర్ కమ్ముల,నాగ చైతన్య అక్కినేని,సాయి పల్లవి,సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ,విక్రమ్ కుమార్,నాగ చైతన్య,థ్యాంక్యూ
    నాగ చైతన్య, విక్రమ్ కుమార్, దిల్ రాజు Photo : Twitter


    విక్రమ్ కుమార్ తాజాగా నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో చైతన్య సోదరుడు అఖిల్ 'హలో' చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. అయితే ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో వచ్చే ఈ తాజా చిత్రానికి 'థ్యాంక్యూ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుందని టాక్. ఈ సినిమా గురించి పూర్తి సమాచారం కొద్ది రోజుల్లో తెలవనుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు