Home /News /movies /

NAGA CHAITANYA VIKRAM K KUMAR THANK YOU TEASER RELEASED SR

Naga Chaitanya | Thank You Teaser : అదిరిన థాంక్యూ టీజర్.. కేక పెట్టించిన నాగ చైతన్య..

Naga Chaitanya Vikram K Kumar Thank You Teaser Photo : Twitter

Naga Chaitanya Vikram K Kumar Thank You Teaser Photo : Twitter

Naga Chaitanya | Thank You Teaser : నాగ చైతన్య ప్రస్తుతం (Vikram  K Kumar ) విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి (Thank You Teaser ) టీజర్ విడుదలైంది. టీజర్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. జీవితంలో అహంకారం ఉన్న ధనిక వ్యాపారవేత్తగా నాగ చైతన్య అదరగొట్టారు.

ఇంకా చదవండి ...
    Naga Chaitanya : నాగ చైతన్య (Naga Chaitanya) గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా తన తండ్రి నాగార్జునతో కలిసి ఈయన చేసిన  సినిమా బంగార్రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ’మజిలీ’ తర్వాత ’లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో కెరీర్‌లో ఫస్ట్ హాట్రిక్ అందుకున్నాడు. అంతకు ముందు ’వెంకీ మామ’ సినిమా కూడా సక్సెస్ అయింది. అది కలుపుకుంటే వరుసగా నాలుగు హిట్స్ అందుకున్నట్టు లెక్క.  ఇక అది అలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం (Vikram  K Kumar ) విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి (Thank You Teaser ) టీజర్ విడుదలైంది. టీజర్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. జీవితంలో అహంకారం ఉన్న ధనిక వ్యాపారవేత్తగా నాగ చైతన్య అదరగొట్టారు. జీవితంలో చాలా కాంప్రమైజ్ అయ్యాను.. ఇక అయ్యేది లేదంటూ నాగ చైతన్య (Naga Chaitanya ) డైలాగ్ అదిరిందని అంటున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్యతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో అవికా గోర్, మాళవిక నాయర్, (Raashi Khanna) రాశీ ఖన్నా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలైలో విడుదలకు రెడీ అవుతోంది.

    ఇక మరో వైపు నాగ చైతన్య సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌‌లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌‌ను ఖరారు చేసారు. మరోవైపు  ఇక చైతన్య హిందీలో తొలిసారి ‘లాల్ సింగ్ చద్ధా’లో నటించారు.  ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 11న విడుదల చేస్తున్నారు.


    తాజాగా తమిళ దర్శకుడి వెంకట్ ప్రభుతో నాగ చైతన్య 22వ చిత్రం.. అధికారిక ప్రకటన చేశారు. మరోవైపు  నాగ చైతన్యతో తన బావ  రానా దగ్గుబాటితో కలిసి ఓ సూపర్ హిట్ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రీసెంట్‌గా తమిళంలో శింబు, ఎస్.జే.సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘మానాడు’ సినిమాను తెలుగు రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఇపుడీ రీమేక్‌లో శింబు పాత్రలో నాగ చైతన్య, ఎస్.జే. సూర్య పాత్రలో రానా దగ్గుబాటి నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Naga Chaitanya, Raashi Khanna, Tollywood news

    తదుపరి వార్తలు