NAGA CHAITANYA VIKRAM K KUMAR THANK YOU TEASER RELEASED POST PONED HERE ARE THE DETAILS SR
Naga Chaitanya : మరోసారి వాయిదా పడిన నాగ చైతన్య థాంక్యూ మూవీ.. కారణం అదేనా..
Thank you movie postponed Photo : Twitter
Naga Chaitanya | Thank You : నాగ చైతన్య ప్రస్తుతం (Vikram K Kumar) విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్న డేట్ ప్రకారం జూలై 8న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వాయిదా పడ్టట్లు చిత్రబృందం ప్రకటించింది.
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ థాంక్యూ. ఇటీవలే టీజర్ (Thank You Teaser ) విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు చిత్రబృందం ప్రకటించింది. మొదట ఈ చిత్రాన్ని జూలై 8న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం రీరికార్డింగ్ ఇంకా ఫినిష్ కాలేదని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా వాయిదా పడిందని అంటున్నారు. టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను జూలై 22, 2022 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, మాలవికా నాయర్, అవికా గోర్లు హీరోయిన్స్‌గా నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇక పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు.
ఇక నాగ చైతన్య గత సినిమాల విషయానికి వస్తే.. నాగ చైతన్య (Naga Chaitanya) గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా తన తండ్రి నాగార్జునతో కలిసి ఈయన చేసిన సినిమా బంగార్రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ’మజిలీ’ తర్వాత ’లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో కెరీర్లో ఫస్ట్ హాట్రిక్ అందుకున్నాడు. అంతకు ముందు ’వెంకీ మామ’ సినిమా కూడా సక్సెస్ అయింది.
— Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022
ఇక మరో వైపు నాగ చైతన్య సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్లతో 3 సీజన్లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. మరోవైపు ఇక చైతన్య హిందీలో తొలిసారి ‘లాల్ సింగ్ చద్ధా’లో నటించారు. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 11న విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా చైతన్య తమిళ దర్శకుడి వెంకట్ ప్రభుతో తన 22వ చిత్రాన్ని మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో మరోసారి చైతన్యతో కృతి శెట్టి నటించనుంది. ఆమె గతంలో బంగార్రాజులో నటించిన సంగతి తెలిసిందే.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.