Home /News /movies /

NAGA CHAITANYA VIKRAM K KUMAR THANK YOU MOVIE SHOOTING COMPLETED HERE ARE THE DETAILS SR

Naga Chaitanya : అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్... అనుకున్న సమయం కంటే ముందే...

Naga Chaitanya Photo : Twitter

Naga Chaitanya Photo : Twitter

Naga Chaitanya : అక్కినేని నటవారసుడు నాగ చైతన్య లవ్ స్టోరితో సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఆయన ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ అదరగొడుతున్నారు.

  అక్కినేని నటవారసుడు నాగ చైతన్య లవ్ స్టోరితో సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన చేస్తోన్న లేటెస్ట్ చిత్రం థాంక్యూ... లవ్ స్టోరి  (Love story) తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ (Thank You) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం పెద్దగా బ్రేక్స్ లేకుండానే శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ తన సోషల్ మీడియాలో తెలిపారు. గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య నటించిన సంగతి తెలిసిందే. అక్కినేని హీరోలతో విక్రమ్ 'మనం' వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు పెద్దగా అలరించలేకపోతున్నాయి.

  విక్రమ్ కే కుమార్ మనం సినిమా తర్వాత మరోసారి అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో మూవీ మాత్రం కొంత నిరాశ పరిచింది. ఆ తర్వాత విక్రమ్ నానితో గ్యాంగ్ లీడర్ అనే థ్రిల్లర్‌ను తీశారు. అయితే ఆ సినిమా కథ బాగున్న పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాను పక్కాగా ప్లాన్ చేశారట. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటీ ఫలితాన్ని ఇవ్వనుందో.. థాంక్యూ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

  Upasana Konidela : కుటుంబంతో కలిసి ఉపాసన బతుకమ్మ సంబరాలు.. వైరల్ అవుతోన్న పిక్స్..

  ఈ సినిమా తర్వాత చైతన్య ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు  చైతన్య మరో సినిమాకు కూడా సై అన్నట్లు తెలుస్తోంది. హీరో, నిర్మాత, దర్శకుడైన అర్జున్ ఇప్పటికే కొన్ని విజయవంతమైన సినిమాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అర్జున్ నాగ చైతన్యకు ఓ స్టోరిని వినిపించారట. అర్జున్ చెప్పిన యాక్షన్ కథ చైతన్యకు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి చైతన్య ఓకే అన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓరేంజ్‌లో ఉంటాయట. ఇప్పటికే నాగచైతన్య మూడు సినిమాలకు కమిట్ అయ్యారు. వీటితో పాటు 'బంగార్రాజు' 'నాగేశ్వరరావ్' సినిమాల్లో నటించనున్నారు.  ఇక చైతన్య తాజా సినిమా లవ్ స్టోరి సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ముప్పై రెండు కోట్లకు పైగా షేర్ సాధించి.. ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను (Aha) ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా ఆహాలో అక్టోబర్ 22న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

  Bigg Boss Telugu 5 : చప్పగా బిగ్‌బాస్ షో.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసింది...

  ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ స్టార్ మా (Star Maa) సొంతం చేసుకుంది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్ని పోషించారు.

  ఇక నాగచైతన్య, (Naga Chaitanya) సమంత తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే. కొన్ని రోజులుగా మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నప్ప‌టికీ స్పందించ‌ని చైతన్య, సమంతలు సడెన్’గా సామాజిక మాధ్య‌మాల్లో అధికారికంగా విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌ించారు. దీంతో షాక్ అవ్వడం అక్కినేని ఫ్యాన్స్ వంతు అయ్యింది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Naga Chaitanya, Tollywood news

  తదుపరి వార్తలు