హోమ్ /వార్తలు /సినిమా /

Naga Chaitanya : నాగ చైతన్య తొలి వెబ్ సిరీస్‌కు టైటిల్ ఖరారు.. అధికారిక ప్రకటన..

Naga Chaitanya : నాగ చైతన్య తొలి వెబ్ సిరీస్‌కు టైటిల్ ఖరారు.. అధికారిక ప్రకటన..

Naga Chaitanya Vikram k kumar new web series Photo : Twitter

Naga Chaitanya Vikram k kumar new web series Photo : Twitter

Naga Chaitanya : నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ (Love Story) సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల ఆయన హీరోగా వచ్చిన మరో సినిమా బంగార్రాజు (Bangarraju). ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే నాగ చైతన్య  (Naga Chaitanya) ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

ఇంకా చదవండి ...

Naga Chaitanya : అక్కినేని నటవారసుడు నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు పోయిన యేడాది ‘లవ్ స్టోరీ’ (Love Story) సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల ఆయన హీరోగా వచ్చిన మరో సినిమా బంగార్రాజు (Bangarraju). ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే నాగ చైతన్య  (Naga Chaitanya) ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌(Vikram K Kumar)తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ సిరీస్‌కు 'ధూత' (Dhootha) అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య  (Naga Chaitanya) దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ధూత (Dhootha) వెబ్ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ దాస్యం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. దూత ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ రావోచ్చని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌‌లుగా తెరకెక్కించనున్నారట.

ఇక నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘థాంక్యూ’ (Thank You) పేరుతో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు చేసుకుంటోంది. అయితే ఈ సినిమా థియేటర్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుందని, కొన్ని వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థతో మంచి ఫ్యాన్సీ రేటుకు డీల్‌ కుదరిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంటూ వార్తలు వినిపించాయి. ఈ పుకార్లపై థాంక్యూ మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సమయం వచ్చినప్పుడు చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌లో విడుదల చేస్తామని స్పష్టం చేసింది టీమ్. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, మూవీ థియేటర్‌లో మంచి వినోదం పంచుతుందంటూ పుకార్లకు చెక్‌ పెట్టారు మేకర్స్‌. థాంక్యూ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా(Raashi Khanna) నటిస్తున్నారు. ఇతర కీలకపాత్రల్లో అవికా గోర్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.

ఈ సినిమాతో పాటు నాగ చైతన్య మరోవైపు విక్రమ్ కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. ఇక చైతన్య హిందీలో తొలిసారి ‘లాల్ సింగ్ చద్ధా’లో నటిస్తున్నారు. ఇక నాగ చైతన్య (Bangarraju) బంగార్రాజు విషయానికి వస్తే.. ఈ సినిమాలో నాగచైతన్య, నాగార్జున కలిసి నటించారు. బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టించగా.. నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటించారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో (Zee5) స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందుతోంది.

First published:

Tags: Naga Chaitanya, Tollywood news, Vikram K Kumar

ఉత్తమ కథలు