వెంకీమామ మేకింగ్ వీడియో రిలీజ్...మామ, అల్లుళ్లు మామూలుగా లేరుగా...

దర్శకుడు కేఎస్‌ రవీంద్ర(బాబీ) పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను విడుదల చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం మేకింగ్ వీడియోను హీరో రానా తన ట్విటర్‌ లో పోస్ట్‌ చేశాడు.

news18-telugu
Updated: August 1, 2019, 10:30 PM IST
వెంకీమామ మేకింగ్ వీడియో రిలీజ్...మామ, అల్లుళ్లు మామూలుగా లేరుగా...
వెంకీ మామ పోస్టర్ (ఫైల్ చిత్రం)
  • Share this:
క్రేజీ కాంబినేషన్ వెంకటేష్, నాగచైతన్య లీడ్ రోల్స్ గా వస్తున్న వెంకీ మామ సినిమా మేకింగ్‌ వీడియో విడుదలైంది. దర్శకుడు కేఎస్‌ రవీంద్ర(బాబీ) పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను విడుదల చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం మేకింగ్ వీడియోను హీరో రానా తన ట్విటర్‌ లో పోస్ట్‌ చేశాడు. అయితే త్వరలోనే ఈ సినిమా టీజర్ ను సైతం విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అక్కినేని నాగచైతన్యకు స్వయానా మేనమామ అయిన వెంకటేష్, ఇప్పటికే ప్రేమమ్ చిత్రంలో అతిథి పాత్రలో నాగచైతన్యతో వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోగా, ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.First published: August 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు