హోమ్ /వార్తలు /సినిమా /

HBD Chaitanya : చైతన్య సమంత లవ్ స్టోరిలో ఎన్ని ట్విస్టులో.. తెలిస్తే మీ హృదయం కరుగుతుంది..

HBD Chaitanya : చైతన్య సమంత లవ్ స్టోరిలో ఎన్ని ట్విస్టులో.. తెలిస్తే మీ హృదయం కరుగుతుంది..

ఎందుకంటే తనకు సిగ్గు లేదంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది సమంత. దాంతోపాటు హిందీలో తొలిసారి ఈమె కనిపించిన మనోజ్ బాజ్‌పెయీ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఎందుకంటే తనకు సిగ్గు లేదంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది సమంత. దాంతోపాటు హిందీలో తొలిసారి ఈమె కనిపించిన మనోజ్ బాజ్‌పెయీ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

HBD Naga Chaitanya : నాగ చైతన్య, సమంత మధ్య దశాబ్దం పాటు సాగిన రొమాన్స్ (romance) అందరికీ తెలిసిన విషయమే కానీ.

నాగ చైతన్య, సమంత మధ్య దశాబ్దం పాటు సాగిన రొమాన్స్ (romance) అందరికీ తెలిసిన విషయమే కానీ. వీరి మధ్య దాగున్న సీక్రెట్స్ అది కూడా లవ్ సీక్రెట్స్ (love secrets) తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చై 34వ పుట్టిన రోజు సందర్భంగా ఈ సీక్రెట్స్ బయటికి వచ్చాయి. అక్టోబర్ 2017లో వీరి వివాహం జరగ్గా అప్పటి నుంచీ వీరు హ్యాపీ కపుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ జంటకు భలే ఆదరణ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  వీరు ఎలా కలుసుకున్నారు? ఓ ఇది కూడా చెప్పాలా? వీరు కలిసింది "ఏం మాయ చేశావే" సినిమా సెట్లో అని సింపుల్ గా అనకండి. నిజానికి అప్పట్లో శృతి హాసన్ తో రిలేషన్ షిప్ లో ఉన్న చై (Chaitanya) సడన్ గా శ్యామ్ ప్రేమలో పడిపోయారు. దీంతో "ఏం మాయ చేశావే" సినిమాలో వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ తెగ పండింది. ఇక సమంత విషయానికి వస్తే ఆమె అప్పుడు హీరో సిద్ధార్థతో డేటింగ్ లో ఉంది. కానీ 2013లో శృతితో బ్రేకప్, సో చై మళ్లీ సింగిల్ గా మారాడు. ఆతరువాత కొద్ది రోజులకే సిద్ధుతో సమంతకు బ్రేకప్ అయిపోయింది.

ఆటో నగర్ లో ప్రేమ్ నగర్

2009లో "ఏం మాయ చేశావే" సినిమా షూట్లో వీరు కలుసుకుని, మంచి ఫ్రెండ్స్ అయి సాన్నిహిత్యాన్ని ఎంజాయ్ చేసినా 2014లో వీరిమధ్య ప్రేమ చిగురుంచి, బలమైన బంధంగా మారింది. సరిగ్గా చెప్పాలంటే "ఆటో నగర్ సూర్య" వీరి ప్రేమకు సరైన దిశానిర్దేశం చేసింది. ఈ సినిమా ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొని, ఆఖరుకి లేట్ గా రిలీజ్ అయినప్పటికీ, సినిమా ఫ్లాప్. వీరిద్దరి ప్రేమ మాత్రం పట్టాలెక్కి, సూపర్ హిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ లో వీరిద్దరూ పూర్తిగా క్లోజ్ అయిపోయారు. 2015 వచ్చేసరికి వీరు ఏకంగా పబ్లిక్ గా అది కూడా ట్విట్టర్లోనే ఒకరిని ఒకరు ఫ్లర్ట్ చేసుకున్నారు కూడా. చైతన్య పుట్టినరోజున బర్త్ డే విషెస్ చెప్పిన సమంత వ్యవహారం ఎంత ఓపన్ గా సాగిందంటే వీరిద్దరి మధ్య ఏదో ఉందని అర్థం వచ్చేలా, అది అనుమానం కలిగేలా చేసేంత క్లియర్ గా సమంత విషెస్ చెప్పింది. "నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఎప్పటికీ, సదా..మరో గొప్ప వసంతంలోకి అడుగుపెడుతున్న నీకు శుభాకాంక్షలం"టూ తమ ప్రేమ వ్యవహారంపై క్లూ ఇచ్చేశారు సమంత.

పాపా అంటూ చై రిప్లై


దీనికి రిప్లై ఇచ్చిన చై కూడా అంతే ప్రేమగా "పాపా" థాంక్యూ అని రిప్లై ఇవ్వడంతో అనుమానాలన్నీ బలపడి వీరిద్దరి ప్రేమ వ్యవహారం, బ్రేకప్ సంగతులు బయటి ప్రపంచానికి అఫిషియల్ గా తెలిసిపోయాయి. అక్కినేని వారసుడైన నాగ చైతన్య తన ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి వరకు తెచ్చేందుకు నానా అగచాట్లు పడ్డాడట. 2015లో తన కుమారుడు ప్రేమలో పడ్డాడని నాగార్జున రివీల్ చేయగా ఆ అమ్మాయి సమంత అని ప్రేక్షకులంతా గెస్ చేశారు. ఆ తరువాత తాము రిలేషన్ షిప్ లో ఉన్నట్టు చై, శ్యామ్ ఇద్దరూ అంగీకరించారు. “A AA” సినిమా రిలీజ్ టైంలో వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని మూవీ స్క్రీనింగ్ కు వచ్చారు. మల్టీప్లెక్స్ వెంట వీరు ఇలా షికార్లు చేయాటన్ని తరచూ నెటిజన్స్ ఫొటోలతో సహా ట్వీట్ చేశారుకూడా. ఆ తరువాతి సంవత్సరం అంటే 2016లో జరిగిన ఓ వివాహ వేడుకకు వీరిద్దరూ జంటగా వెళ్లి అందరి కంటా పడ్డారు. కానీ తన ప్రేమ వ్యవహారాన్ని మొదట తండ్రి నాగ్ కు చెప్పగా ఆయన కూల్ గా రియాక్ట్ అయ్యారట. "నువ్వు నీ ప్రేమ సంగతిని నాకు ఇప్పుడు చెబుతున్నావ్ నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుస"ని చెప్పడంతో తన కుటుంబం తనకు అండగా ఉందని చైతన్య హ్యాపీగా ఫీల్ అయ్యారట.

డ్రీమీ వెడ్డింగ్..

హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్ గోవాలో ఘనంగా సాగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లిలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఆతరువాతి కాలంలో వీరు పోస్ట్ చేయడంతో చైశ్యామ్ ఫ్యాన్స్ ఆనందించారు. వీరి పెళ్లై 3 ఏళ్లు కాగా తరచూ తన భర్త అప్ డేట్స్ ను సగర్వంగా పోస్ట్ చేస్తున్న సమంత నెటిజన్స్ కు తమ జీవితానికి సంబంధించిన హైలైట్స్ వివరిస్తుంటారు. ప్రస్తుతం చైతన్య బర్త్ డే జరుపుకునేందుకు ఈ రొమాంటిక్ కపుల్ మాల్దీవ్స్ లో షికార్లు కొడుతున్నారు. the couple has flown to the Maldives. ఈ వివరాలను సమంత తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. రిలేషన్ షిప్ గోల్స్ లో వీరు టాప్ ట్రెండిగ్ గా దూసుకుపోతున్నారు.

Published by:Suresh Rachamalla
First published:

Tags: Naga Chaitanya, Samantha akkineni, Tollywood news

ఉత్తమ కథలు