"బంగార్రాజు" లవ్ స్టోరీ సినిమాలు సక్సెస్‌తో హీరో నాగచైతన్య (Naga Chaitanya) మరికొన్ని సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ఓవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు వెబ్ సిరీస్‌పై కూడా చైతు ఫోకస్ పెట్టాడు. మనం ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో "దూత"(Dootha Web Series) అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా అడుగు పెట్టబోతున్నాడు చైతు. ఈ మధ్యనే విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఒక హారర్ వెబ్ సిరీస్ .
నాగ చైతన్య ధూత వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ (Prachi Desai) కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పుడు ఈ హీరోయిన్ తన పని అనుభవాన్ని కేవలం రెండు లైన్లలో తన మనసులో మాటను బయట పెట్టింది. నాగ చైతన్యతో కలిసి వర్క్ చేయడం వల్ల కొన్ని తెలుగు లైన్లను నేర్చుకోవడంతో పాటు.. రుచికరమైన ఏసియన్ ఫుడ్‌ను కూడా టేస్ట్ చేశానని రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ , నాగ చైతన్యతో దిగిన ఫోటోను కూడా పోస్టు చేసింది. చైతన్యతో పాటు దర్శకుడికి ధన్యవాదాలు తెలిపింది.
ఈ వెబ్ సిరీస్ కథ ఎలా ఉండబోతోంది అందులో నాగచైతన్య పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో విక్రమ్ మాధవన్ హీరోగా "13 బి" అనే ఒక హారర్ సినిమా తీశారు. టీవీ సీరియల్ పాత్రలతో సైతం భయాన్ని సృష్టించి ప్రేక్షకులను కట్టిపడేసారు విక్రమ్. అయితే "దూత" వెబ్ సిరీస్ లో కూడా విక్రమ్ అలాంటి ఒక షాకింగ్ ఎలిమెంట్ పెట్టబోతున్నారని సమాచారం. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.
అయతే ఈ వెబ్ సిరీస్‌లో ప్రాచీ దేశాయ్‌తో పాటు మళయాళ టాలెంటెడ్ నటి ప్రియా భవాని శంకర్ ,పార్వతిలు నటిస్తున్నారు. వీరితో పాటు తరుణ్ భాస్కర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. . ఇక వీరంతా కలిసి ఉన్న ఫోటో కూడా ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.
‘Thank you’ @Vikram_K_Kumar & @chay_akkineni for making #Dhootha & working in Hyderabad such a breeze!
Not pictured here - me learning my lines in Telugu & gorging on Shoyu food.. pic.twitter.com/0aEKzok0iO
— Prachi Desai (@ItsPrachiDesai) June 15, 2022
నాగ చైతన్య మనం తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా కూడా నటించారు. వీరిద్దరూ థ్యాంక్యూ అనే తెలుగు చిత్రానికి కూడా పని చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు వెళ్లింది, ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, అవికా గోర్ కథానాయికలు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Vikram K Kumar, Web Series