• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAGA CHAITANYA TAKES A BOLD STEP WILL BE SEEN IN THREE DIFFERENT ROLES FOR VIKRAM KUMAR FILM SR

Naga Chaitanya : నాగ చైతన్య బోల్డ్ స్టెప్... అక్కినేని ఫ్యాన్స్‌కు అదిరిపోయే కిక్..

Naga Chaitanya : నాగ చైతన్య బోల్డ్ స్టెప్... అక్కినేని ఫ్యాన్స్‌కు అదిరిపోయే కిక్..

నాగ చైతన్య Photo : Twitter

Naga Chaitanya-Vikram Kumar : విక్రమ్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది.

  • Share this:
    Naga Chaitanya-Vikram Kumar : నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే  చాలా వరకు లవ్ స్టోరీ షూటింగ్ జరుపుకుంది. కారోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. 'లవ్ స్టోరీ' తర్వాత మరో రెండు సినిమాలకు ప్లాన్ చేశాడు చైతూ.. అందులో భాగంగా ఆయన 'బంగార్రాజు' 'నాగేశ్వరరావ్' సినిమాల్లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'దిల్' రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. విక్రమ్ కుమార్ ఇటీవల నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో చైతన్య సోదరుడు అఖిల్ 'హలో' చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. అయితే ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో వచ్చే ఈ తాజా చిత్రానికి 'థ్యాంక్యూ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుందని టాక్. కాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడట చైతన్య. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాలో చైతన్య మూడు విభిన్న గెటప్స్ లో కనిపిస్తాడట. అందులో భాగంగా చైతన్య ప్రస్తుతం ఆయా గెటప్స్ కోసం మేకోవర్‌ అవుతున్నట్టు సమాచారం. ఇక కరోనా లాక్ డౌన్ పూర్తిగా తీసిన వెంటనే.. ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ చేస్తోంది చిత్రబృందం. ఇక ఈ సినిమా తర్వాత చైతన్య ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు