• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAGA CHAITANYA SHOCKS AKKINENI NAGARJUNA BY DROPPING OUT OF THE FILM MHN

Akkineni Nagarjuna - Naga Chaitanya: నాగార్జునకే షాకిచ్చిన నాగచైతన్య... సినిమా నుంచి డ్రాప్

Akkineni Nagarjuna - Naga Chaitanya: నాగార్జునకే షాకిచ్చిన నాగచైతన్య... సినిమా నుంచి డ్రాప్

Naga Chaitanya shocks Akkineni Nagarjuna by dropping out of the film

Akkineni Nagarjuna - Naga Chaitanya: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తారని అనుకున్న బంగార్రాజు సినిమా నుంచి నాగచతైన్య బయటకు వచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ సీజ‌న్ 4 హోస్టింగ్ ముగియ‌క ముందే తాను న‌టిస్తోన్న వైల్డ్‌డాగ్ చిత్రీక‌ర‌ణ‌లో త‌న పార్ట్‌ను చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశాడు. నాగార్జున వైల్డ్‌డాగ్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయిేత తదుపరి నాగార్జున ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్‌గా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు సొగ్గాడే చిన్ని నాయ‌నాకు సీక్వెల్‌గా బంగార్రాజు సినిమాను తెర‌కెక్కిస్తార‌ని టాక్ వినిపించింది. ఇందులో నాగార్జున తాత పాత్ర‌లో క‌నిపిస్తే చైత‌న్య మ‌న‌వ‌డి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని అనుకున్నారు.

    ఈ సినిమా కోసం డైరెక్ట‌ర్ క‌ల్యాణ్ కృష్ణ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. చాలా రోజులుగా వెయిటింగ్‌లో ఉన్న కల్యాణ్‌కృష్ణకు ఎట్ట‌కేల‌కు నాగార్జున, అన్న‌పూర్ణ స్టూడియో నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. అయితే ఈ సినిమాలో న‌టిస్తాడ‌ని అనుకున్న నాగ‌చైత‌న్య.. అన్న‌పూర్ణ స్టూడియోకు షాక్ ఇచ్చాడు. ఎందుకంటే, బంగార్రాజు సినిమా నుంచి నాగ‌చైత‌న్య డ్రాప్ అయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకు కార‌ణం.. ఇప్ప‌టి వర‌కు చాలా రోజులుగా బంగార్రాజు సినిమా కోసం వెయిట్ చేసిన చైత‌న్య‌, చివ‌ర‌కు ఇది స్టార్ట్ కాదేమోన‌నుకుని ఇత‌ర సినిమాల‌కు క‌మిట్ అయ్యాడు. ఇప్పుడు డేట్స్ క్లాష్ వ‌స్తుండ‌టంతో త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ని స‌మాచారం. దీంతో నిర్మాతలు ఆ పాత్రకు మరో హీరోను వెతుక్కుంటున్నారట.

    ‘వైల్డ్ డాగ్’ మూవీలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. దియామీర్జా హీరోయిన్‌గా న‌టిస్తుంది. స‌యామీ ఖేర్ ఇందులో నాగార్జున యాక్ష‌న్ టీం మెంబ‌ర్‌గా క‌నిపించ‌నుంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అహిషోర్ సాల్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చైత‌న్య ఏమో విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థాంక్యూ సినిమాలో న‌టిస్తున్నాడు.
    Published by:Anil
    First published: