నా లైఫ్‌లో సమంత తర్వాత ఆ రెండే ముఖ్యమంటున్న నాగ చైతన్య..

అక్కినేని నట వారసుడిగా ‘జోష్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాగ చైతన్య ఆ తర్వాత తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు.ఇక ఆయన జీవితంలో ఫ్యామిలీ తర్వాత ఆ రెండే ముఖ్యమంటున్నాడు.

news18-telugu
Updated: December 5, 2019, 2:14 PM IST
నా లైఫ్‌లో సమంత తర్వాత ఆ రెండే ముఖ్యమంటున్న నాగ చైతన్య..
నాగ చైతన్య (File Photo)
  • Share this:
అక్కినేని నట వారసుడిగా ‘జోష్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాగ చైతన్య ఆ తర్వాత తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. ఇక రెండు సినిమా ‘ఏం మాయ చేసావే’ చిత్రంలో కలిసి నటించిన సమంతనే ఆ తర్వాత తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. ఒక వైపు సినిమాలు, మరోవైపు కుటుంబానికి సమ ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు 19 చిత్రాల్లో నటించిన నాగ చైతన్యకు తన కెరీర్‌లో రెండంటే రెండు చిత్రాలు ప్రత్యేకం అని చెబుతున్నాడు. అందులో తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి నటించిన ‘మనం’ ఒకటైతే.. రెండోది ‘వెంకీ మామ’. తొలిసారి ‘ప్రేమమ్’ లో కాసేపు తెరపై కనిపించిన వెంకటేష్,నాగ చైతన్యలు ‘వెంకీ మామ’ సినిమాలో పూర్తి స్థాయిలో కలిసి నటించారు. వెంకటేష్ ఈ సినిమాలో రైతు పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య జవాను క్యారెక్టర్‌లో నటించడం విశేషం.

naga chaitanya says after samantha and family these two things are very important in my life,samantha,naga chaitanya,manam movie,nagarjuna akkineni,venkatesh,venky mama,venky mama venkatesh naga chaitanya,venkatesh,venkatesh birthday,venky mama,venky mama twitter,venky mama release date,venky mama release date on december 13,venky mama look,venky mama vinayaka chavithi poster,venkatesh naga chaitanya,naga chaitanya twitter,venky mama twitter,venky mama movie release date,telugu cinema,venky mama,venkatesh naga chaitanya movie,naga chaitanya,venky mama teaser,venky mama first look,venky mama trailer,venky mama movie,venky mama songs,venky mama first look teaser,venky mama movie teaser,venky mama release date,venky mama movie release date,venky mama movie updates,naga chaitanya movies,venky mama movie trailer,venky mama telugu movie,venky mama making,venkatesh,వెంకటేష్,నాగచైతన్య,వెంకీ మామా వినాయక చవితి పోస్టర్,తెలుగు సినిమా,వెంకీ మామ రిలీజ్ డేట్ ఫిక్స్,నాగ చైతన్య మనం,నాగ చైతన్య వెంకీ మామ
’వెంకీ మామ’పోస్టర్ (Instagram/Photo)


కెరీర్ మొత్తంలో ఎన్ని సినిమాలు చేసినా.. ఈ రెండు చిత్రాలు రీప్లేస్ చేయలేనివని ‘వెంకీ మామ’ ఆడియో ఫంక్షన్‌లో చెప్పాడు చైతూ. అంతేకాదు ఈ సినిమా వెంకటేష్‌ పుట్టినరోజున విడుదల కావడం విశేషం. ఇన్నేళ్ల కెరీర్‌లో వెంకటేష్ ఏ సినిమా కూడా ఆయన బర్త్ డే రోజున విడుదల కాలేదు. ఇపుడు ఫస్ట్ టైమ్ ‘వెంకీ మామ’తో ఆ కోరిక నెరవేరబోతుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించింది. ఇంకోవైపు రాశిఖన్నా.. చైతూ సరసన యాక్ట్ చేసింది.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు