Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: April 13, 2019, 12:37 PM IST
మజిలీ సినిమా
మజిలీ సినిమాతో మరుపురాని విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య, సమంత. పెళ్లి తర్వాత ఎలాంటి ఎమోషనల్ సినిమాలో అయితే నటించాలి అనుకున్నారో.. అచ్చంగా అలాంటి కథనే తీసుకొచ్చాడు శివ నిర్వాణ. వాళ్ల మజిలీని మరింత అందంగా మార్చేసాడు. ఈ చిత్రం వారం రోజుల్లోనే 30 కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. రెండో వారంలో కూడా సత్తా చూపిస్తుంది మజిలీ. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత ఈ జంటతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు.. ఇక దర్శకులు కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా కథలు సిద్ధం చేస్తున్నారు.

మజిలీ సినిమా ఫోటోస్
కాస్త ఎమోషనల్ టచ్ ఉన్న కథ అయితే చైస్యామ్ కూడా నటించడానికి సై అంటున్నారు. తాజాగా తామిద్దరూ మరో సినిమాలో నటించబోతున్నామని సన్నిహితులతో సమంత చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ జోడీ 'ఏ మాయ చేసావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య' వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు మజిలీతో మరోసారి మాయ చేసారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా వీళ్ల కెమిస్ట్రీ అదుర్స్ అనిపిస్తుంది. అందుకే వీళ్లు కలిసి నటిస్తున్నారంటే సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉంటాయి.

నాగచైతన్య., సమంత
ఈ క్రేజ్ క్యాష్ చేసుకోడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారిప్పుడు. ఇక సమంత కూడా మంచి కథ ఉంటే సిద్ధం చేయండి.. కలిసి నటిస్తామని ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు హింట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. భర్త నాగ చైతన్యతో మరోసారి కలిసి నటించాలని ఉందని ఓపెన్‌గానే మనసులో ఉన్న మాట బయటపెట్టింది స్యామ్. ఇంత మంచి ఆఫర్ ఇచ్చినపుడు దర్శకులు మాత్రం ఊరికే ఎందుకుంటారు.. అందుకే ఇప్పటికే ఈ జంట కోసం కథ వండటం కొందరు దర్శకులు మొదలు పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం ఓ బేబీతో పాటు ఓ తమిళ్ సినిమాలో నటిస్తుంది. ఇక చైతూ మాత్రం వెంకీ మామతో బిజీగా ఉన్నాడు.
First published:
April 13, 2019, 12:37 PM IST