Majili Collections: 50 కోట్ల క్లబ్‌లో నాగచైతన్య, సమంత మజిలీ..

కొంతకాలంగా నాగచైతన్య.. సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఆయన ఎదురుచూపులు ఈ మజిలీ సినిమాతో తీరాయి.. మజిలీ..అనుకున్నట్టుగానే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

news18-telugu
Updated: April 15, 2019, 1:00 PM IST
Majili Collections: 50 కోట్ల క్లబ్‌లో నాగచైతన్య, సమంత మజిలీ..
50 కోట్ల క్లబ్‌లో నాగచైతన్య, సమంత మజిలీ..
news18-telugu
Updated: April 15, 2019, 1:00 PM IST
మజిలీ సినిమాతో.. నాగ చైతన్య, సమంత జంట బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నారు. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం, తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. వారం మొత్తం.. అదే దూకుడు సాగిస్తే.. ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని అనుకున్నారు సినీ పండితులు. అనుకున్నట్టుగానే ఈ సినిమా చాలా తేలికగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. కొంతకాలంగా చైతూ సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అలాంటి హిట్ ఆయనకి, సమంతతో లభించడం విశేషంగా చెబుతున్నారు.. తొలివారంలోనే రూ. 30కోట్లు తీసుకొచ్చింది మజిలీ. ఈ వీకెండ్ లోనూ కలెక్షన్స్ నిలకడగా ఉండటంతో రూ. 50కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే అన్ని చోట్ల లాభాల బాట పట్టింది మజిలీ. ఈ సినిమాను16 కోట్లకు అమ్మేసినట్లు టాక్...దీంతో ఇప్పటికే పెట్టుబడి చాలా చోట్ల వెనక్కి వచ్చేయడమే కాకుండా లాభాలు తీసుకొచ్చింది మజిలీ. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం రప్ఫాడిస్తోంది. అక్కడ ఇప్పటికే 4 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.



First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...