హోమ్ /వార్తలు /సినిమా /

Samantha | Naga Chaitanya : భార్య భర్తలుగా విడిపోయిన సమంత, నాగచైతన్య.. అధికారిక ప్రకటన...

Samantha | Naga Chaitanya : భార్య భర్తలుగా విడిపోయిన సమంత, నాగచైతన్య.. అధికారిక ప్రకటన...

Samantha, Naga chaitanya Photo : Twitter

Samantha, Naga chaitanya Photo : Twitter

Samantha | Naga Chaitanya : భార్య భర్తలుగా సమంత, నాగ చైతన్యలు విడిపోయారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.

  భార్య భర్తలుగా సమంత, నాగ చైతన్యలు విడిపోయారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నారు. చాలా కాలం నుంచి ఈ విషయం గురించి ఆలోచించి నాగ చైతన్య, నేను ఓ నిర్ణయానికి వచ్చాము. ఇక నుంచి మీము ఇద్దరం భార్య భర్తలుగా విడిపోతున్నాము. ఈ పది సంవత్సరాల కాలంలో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అది అలానే కొనసాగుతుందని అనుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మా భావాలను అభిమానలు అర్ధం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని కోరుకుంటున్నాము. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు మాకు ఉండాాలి అంటూ ఓ పోస్ట్ చేశారు సమంత. ఈ నిర్ణయంతో అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ షాక్‌కు గురైయారు.

  ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని గుణ శేఖర్ (Gunasekhar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha akkineni )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు.


  View this post on Instagram


  A post shared by S (@samantharuthprabhuoffl)  ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

  Gopichand : దసరాకు పేలబోతున్న గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్‌.. అధికారిక ప్రకటన..

  ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో కాకుండా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్టు రిలీజ్ కానుందని తెలుస్తోంది.

  దీనికి సంబంధించి హాట్ స్టార్‌తో డీల్ కూడా కుదిరినట్లు సమాచారం. దీపావళికి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇక  ఈ సినిమా నుంచి ఇటీవల రెండు అనే పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Naga chaitanaya, Naga Chaitanya Samantha Divorce, Samantha Ruth Prabhu, Tollywood news

  ఉత్తమ కథలు