Home /News /movies /

NAGA CHAITANYA SAMANTHA DIVORCE SAMANTHA FATHER JOSEPH PRABHU REACTION OVER HIS DAUGHTER DIVORCE ISSUE TA

Naga Chaitanya Samantha Divorce : సమంత విడాకులపై ఆమె తండ్రి ఆశ్యర్యకరమైన ట్వీట్..

తల్లిదండ్రులు సోదరులతో సమంత, నాగా చైతన్య (File/Photo)

తల్లిదండ్రులు సోదరులతో సమంత, నాగా చైతన్య (File/Photo)

Naga Chaitanya Samantha Divorce : గత కొన్నాళ్లుగా తెలుగు మీడియాలో నాగ చైతన్య, సమంత విడాకుల విషయమై పెద్ద చర్చే జరిగింది. తాజాగా కూతురు సమంత విడాకులపై ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు స్పందించారు.

    Naga Chaitanya Samantha Divorce : గత కొన్నాళ్లుగా తెలుగు మీడియాలో నాగ చైతన్య, సమంత విడాకుల విషయమై పెద్ద చర్చే జరిగింది. ఇదంత రూమర్సే అని అక్కినేనితో పాటు సమంత అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఏదైతే జరగకూడదని ఫ్యాన్స్ అనుకున్నారో అదే జరిగింది. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నారని జరుగుతున్న ప్రచారం నిజమయింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో సమంత, చైతన్య వారి పెళ్లి వార్షికోత్సవానికి ఐదు రోజులు ముందు ట్వీట్ చేసి సంచలనం రేపారు. ఎంతో కాలంగా ఈ విషయం గురించి ఆలోచించి నాగ చైతన్య, నేను ఓ నిర్ణయానికి వచ్చామని ఇద్దరు సోషల్ మీడియాలో తెలిపారు. ఇద్దరు దాదాపు ఒకే సమయంలో సోషల్ మీడియలో తాము విడిపోతున్నట్టు పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరు విడిపోతున్నట్టు వార్తలు వచ్చినా.. ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేసి అసలు విషయం బయట పెట్టారు.

    ఈ సందర్భంగా సమంత, నాగ చైతన్య ఈ పదేళ్ల కాలంలో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అది అలానే కొనసాగుతుందని అనుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మా భావాలను అభిమానలు అర్ధం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని కోరుకుంటున్నాము. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు మాకు ఉండాాలి అంటూ ఓ పోస్ట్ చేశారు సమంత.

    Mohan Babu : ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు నాకు మాత్రమే సొంతం అంటున్న మోహన్ బాబు..


    వీళ్లిద్దరు విడిపోవడానికి ముఖ్యకారణం.. ‘ది ప్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో పాటు ‘సూపర్ డీలక్స్’ సినిమాల్లో సమంత రెచ్చిపోయి నటించడమే అని అభిమానులతో పాటు ప్రేక్షకులు అనుకుంటున్నారు. విడాకుల నిర్ణయంతో అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ షాక్‌కు గురైయారు. తాజాగా సమంత విడాకుల విషయమై ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కూడా ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

    Chiranjeevi Remakes: లూసీఫర్ కాకుండా చిరంజీవి తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    ఈ విషయం తెలిసినప్పటి  నుంచి తన మైండ్ బ్లాంక్ అయినట్టు పేర్కొన్నారు. సమంత ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అభిప్రాయపడ్డారు. త్వరలో పరిస్థితులు చక్కబడతాయని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయం తెలిసినపట్టి నుంచి తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని అన్నారు. సమంతకు అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని తాను భావిస్తున్నానని, త్వరలోనే ఈ పరిస్థితులు చక్కబడతాయని జోసెఫ్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు.

    Krishnam Raju - Manchu Vishnu: కృష్ణంరాజుకు ఏమైంది.. ఇలా అయిపోయాడేమిటి.. ? ఆందోళనలో రెబల్ స్టార్ ఫ్యాన్స్..


    నాగ చైతన్య, సమంత మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వారిద్దరు విడిపోయారు. ఈ విషయం ఒక రకంగా నాకు ఎంతో బాధ కలిగించింది. ఒక భార్య భర్తలుగా వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో వారి వ్యక్తిగత విషయం. వాళ్లిద్దరు నాకు కావాల్సిన వారు. వారితో నేను గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. సమంత, నాగ చైతన్యకు ఆ దేవుడు గుండె ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా నాగార్జున ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Naga Chaitanya Akkineni, Naga Chaitanya Samantha Divorce, Samantha, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు