Home /News /movies /

NAGA CHAITANYA SAMANTHA DIVORCE NAGARUJNA REACTION ON HIS SON NAGA CHIATANYA DIVORCE WITH SAMANTHA TA

Naga Chaitanya Samantha Divorce : నాగ చైతన్య, సమంత విడాకులపై నాగార్జున ఫస్ట్ రియాక్షన్ ఇదే..

ఖచ్చితంగా బలమైన కారణాలు ఉంటాయనే విషయం మాత్రం అందరికీ అర్థమైంది. ఇదిలా ఉంటే సమంత. నాగ చైతన్య విడిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎప్పటిలాగే మళ్ళీ యాక్టివ్ గా ఉన్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటూ బిజీ అయిపోయారు.

ఖచ్చితంగా బలమైన కారణాలు ఉంటాయనే విషయం మాత్రం అందరికీ అర్థమైంది. ఇదిలా ఉంటే సమంత. నాగ చైతన్య విడిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎప్పటిలాగే మళ్ళీ యాక్టివ్ గా ఉన్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటూ బిజీ అయిపోయారు.

Naga Chaitanya Samantha Divorce : గత కొన్ని రోజులుగా అక్కినేని అభిమానుల్లో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ విషయమై నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

    Naga Chaitanya Samantha Divorce : గత కొన్ని రోజులుగా అక్కినేని అభిమానుల్లో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నారని జరుగుతున్న ప్రచారం నిజమయింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో సమంత, చైతన్య ఈ రోజు అధికారిక ప్రకటన విడుదల చేసారు. చాలా కాలం నుంచి ఈ విషయం గురించి ఆలోచించి నాగ చైతన్య, నేను ఓ నిర్ణయానికి వచ్చాము. ఇక నుంచి మీము ఇద్దరం భార్య భర్తలుగా విడిపోతున్నాము. ఈ పది సంవత్సరాల కాలంలో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అది అలానే కొనసాగుతుందని అనుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మా భావాలను అభిమానలు అర్ధం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని కోరుకుంటున్నాము. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు మాకు ఉండాాలి అంటూ ఓ పోస్ట్ చేశారు సమంత. ఈ నిర్ణయంతో అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ షాక్‌కు గురైయారు.

    నాగ చైతన్య, సమంత విడాకులపై నాగార్జున స్పందించారు. నాగ చైతన్య, సమంత మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వారిద్దరు విడిపోయారు. ఈ విషయం ఒక రకంగా నాకు ఎంతో బాధ కలిగించింది. ఒక భార్య భర్తలుగా వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో వారి వ్యక్తిగత విషయం. వాళ్లిద్దరు నాకు కావాల్సిన వారు. వారితో నేను గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. సమంత, నాగ చైతన్యకు ఆ దేవుడు గుండె ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.


    మరో నాలుగు రోజుల్లో( అక్టోబర్ 6న) వీరి నాలుగో వివాహ వార్షికోత్సం జరగాల్సి ఉంది. అయితే అంతకు ముందే తాము విడిపోతున్నట్టుగా సమంత, చైతన్య ప్రకటించారు. ఇక, కొన్ని నెలల క్రితం నుంచే తాము విడిపోతున్నట్టుగా సమంత హింట్స్ ఇవ్వడం మొదలుపెట్టిందనే ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో ఆమె పేరు నుంచి అక్కినేనిని సమంత తొలగించిది. అప్పటి నుంచే వీళ్లిద్దరు విడిపోతున్నారంటూ  జోరుగా ప్రచారం జరిగింది. అనుకున్నట్టే ఇద్దరు విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

    Naga Chaitanya Samantha Divorce : నాగ చైతన్య, సమంత కంటే ముందు విడాకులు తీసుకున్న సినీ ప్రముఖులు..


    అయితే సమంత, చైతన్యల మధ్య విభేదాలను పరిష్కరించడానికి నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నాక.. కౌన్సిలింగ్ చేసినప్పటికీ వీరు విడాకుల కోసమే మొగ్గు చూపారు. చివరకు నేడు చైతన్య, సమంతలు విడాకులకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు.ఇండస్ట్రీలో గుర్తింపు, హోదా, పాపులారిటీని వదులుకోవడానికి సమంత ఇష్టపడకపోవడమే విడాకుల వరకు ఈ వివాదం వచ్చిందనే టాక్ కూడా ప్రచారంలో ఉంది. ఇటీవల సమంత చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో పాటు ‘సూపర్ డీలక్స్‌’ సినిమాల్లో సమంత పాత్రలు కూడా వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడానికి కారణమని చెప్పుకుంటున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Naga Chaitanya Akkineni, Naga Chaitanya Samantha Divorce, Nagarjuna, Samantha, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు