Naga Chaitanya - Samantha: నాగ చైతన్య, సమంత ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదు అయింది. వివారల్లోకి వెళితే.. టాలీవుడ్ టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ జంటల్లో నాగ చైతన్య సమంత ఒకరు. వీళ్లిద్దరు ఫస్ట్ టైమ్ ‘ఏం మాయ చేసావే’ సినిమాలో కలిసి నటించారు. హీరోయిన్గా సమంతకు అదే మొదటి సినిమా. ఇక కథానాయకుడిగా నాగ చైతన్యకు రెండో సినిమా. ఈ సినిమాతో నాగ చైతన్య, సమంత కూడా తొలిసారి హిట్ అందుకున్నారు. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో మొదలైన వీరి ప్రేమ .. పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఏడుడుగులు వేయడంలో పూర్తైయింది. మ్యారేజ్ తర్వాత సమంత కూడా సినిమాలు చేసే విషయంలో దూకుడు మీదుంది. అంతేకాదు అక్కినేని హీరోలు హిట్ కోసం ఎదురు చూస్తుంటే.. సమంత మాత్రం వరుస హిట్స్‌తో దూసుకుపోతూనే ఉంది. సమంత ఓ వైపు సినిమాలు మాత్రమే కాదు.. ఆహా ఓటీటీలో సామ్ జామ్ ప్రోగ్రామ్‌తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. రీసెంట్గా సమంత హిందీలో ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌లో రాజీ పాత్రలో ఇరగదీసింది. ఈ సిరీస్‌లో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి.
మరోవైపు నాగ చైతన్య కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇంకోవైపు నాగ చైతన్య హిందీలో ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత జోడిగా నటించిన ‘మజిలి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాను హిందీలో అదే ‘మజిలి’ టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేసారు. తాజాగా యూట్యూబ్‌లో హిందీ వెర్షన్ ‘మజిలి’ సినిమా 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ సినిమాను 7 ఫిబ్రవరి 2020లో యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు. మొత్తంగా విడుదలైన 16 నెలల తర్వాత 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. మొత్తంగా వీళ్లిద్దరు మ్యారేజ్ జోడిగా నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్ రావడంపై నాగ చైతన్య, సమంత ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు తమిళంలో ఓ మూవీ చేస్తోంది. అంతేకాదు సమంత, నాగ చైతన్య మరోసారి జంటగా ఓ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.