2020 ఏడాది ముగుస్తుండటంతో ఒక్కొక్కరుగా మన సెలబ్రిటీస్ అంతా రాష్ట్రం దాటేస్తున్నారు. కొత్త ఏడాది సంబరాల కోసం బయటికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్లాన్స్ చేసుకోగా.. ఇప్పుడు చైస్యామ్ కూడా వెళ్లిపోయారు. కొత్త ఏడాదికి ఇంకా రెండు రోజులు ఉండగానే ఎయిర్ పోర్టులో కనిపించారు. న్యూ ఇయర్ వేడుకలను ఎప్పట్లాగే ఈ ఇద్దరూ గోవాలో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఏ చిన్న అకేషన్ అయినా కూడా వెంటనే వెకేషన్ కోసం గోవా వెళ్తుంటారు ఈ జంట. వాళ్ల పెళ్లి కూడా గోవాలోనే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. న్యూ ఇయర్ కోసం అక్కడికి వెళ్లారు సమంత చైతూ. డిసెంబర్ 29 ఉదయమే హైదరాబాద్ నుంచి బయల్దేరారు అక్కినేని జంట. అక్కడే నాలుగు రోజులు ఉండి న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ రానున్నారు. ఎయిర్‌పోర్టులో గ్రే, బ్లాక్ దుస్తుల్లో సమంత అక్కినేని.. వైట్ టీ షర్టు, గ్రే కార్గో ప్యాంట్లో నాగచైతన్య కనిపించారు. ఇద్దరూ కరోనా నిబంధనలను పక్కాగా పటిస్తూ మాస్కులు కట్టుకుని కనిపించారు. ఏ చిన్న ఈవెంట్ వచ్చినా కూడా వెంటనే ఈ జంట బయటికి వెళ్లిపోతుంటారు.
మొన్నటికి మొన్న నవంబర్‌లో కూడా నాగ చైతన్య 34వ పుట్టినరోజును మాల్దీవ్స్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు షూటింగ్స్ చేసుకుని ఇప్పుడు మళ్లీ గోవా వెళ్లారు. గోవాలోని ప్లష్ రిసార్ట్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు చైస్యామ్ జోడీ. ప్రస్తుతం నాగ చైతన్య లవ్ స్టోరీ, థ్యాంక్ యూ సినిమాల్లో నటిస్తున్నాడు. మరోవైపు సమంత అక్కినేని తెలుగు సినిమాలు ఏం చేయడం లేదు.. డిజిటల్ మీడియాలో మాత్రం బిజీ అవుతుంది సమంత అక్కినేని.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Samantha akkineni, Telugu Cinema, Tollywood