NAGA CHAITANYA SAMANTHA AGAIN PAIR UP WITH NEXT MOVIE HERE ARE THE DETAILS TA
‘మజిలీ’ తర్వాత మరోసారి జంటగా నాగ చైతన్య, సమంత..
నాగ చైతన్య,సమంత (twitter/photo)
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీల్ లైఫ్ కపుల్‌గా అలరించి.. రియల్ లైఫ్ కపుల్ అయ్యారు నాగ చైతన్య, సమంత. తాజాగా ఈ జంట మరోసారి ప్రేక్షకులను కనువిందు చేయనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీల్ లైఫ్ కపుల్‌గా అలరించి.. రియల్ లైఫ్ కపుల్ అయ్యారు నాగ చైతన్య, సమంత. వీళ్లిద్దరు తొలిసారి ‘ఏమాయ చేసావే’ చిత్రంలో కలిసి పనిచేసారు. హీరోయిన్గా సమంతకు ఇదే ఫస్ట్ మూవీ. హీరోగా నాగ చైతన్యకు రెండో సినిమా. ఈ సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన ‘మనం’ సినిమాలో సమంత, నాగ చైతన్య మరోసారి జోడిగా నటించారు. అదేం విచిత్రమో ఆ తర్వాత సమంత.. అక్కినేని వారి కోడలు అవ్వడం యాదృచ్చికమే అని చెప్పాలి. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత.. దేవా కట్టా దర్శకత్వంలో ‘ఆటో నగర్ సూర్య’ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్లిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒకింటి వారయ్యారు. పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. రీసెంట్గా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించారు. పెళ్లి తర్వాత వీరి కలయకలో వచ్చిన చిత్రం చూడడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపెట్టారు. తాజాగా వీళ్లిద్దరు మరోసారి జోడి కట్టబోతున్నారని సమాచారం. ప్రస్తుతం నాగ చైతన్య..తన మేనమామ వెంకటేష్‌తో కలిసి చేసిన ‘వెంకీ మామ’తో మరో సక్సెస్ అందుకున్నాడు.
పరశురామ్ దర్శకత్వంలో మరోసారి జోడిగా నాగ చైతన్య, సమంత (Twitter/Photo)
ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య పరశురామ్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ స్టోరీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించే ఈ చిత్రంలో మరోసారి నాగ చైతన్య సరసన సమంత మరోసారి జోడి కట్టనుందనే ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ సినిమాతో నాగ చైతన్య,సమంత మరో సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.