• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAGA CHAITANYA SAI PALLAVI STARER SEKHAR KAMMULA LOVE STORY MOVIE TEASER RELEASE DATE FIX TA

Naga Chaitanya -Sai Pallavi: నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..

Naga Chaitanya -Sai Pallavi: నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..

నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు. (Twitter/Photo)

Naga Chaitanya Sai Pallavi Sekhar Kammula Love Story | ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

  • Share this:
    Naga Chaitanya Sai Pallavi Sekhar Kammula Love Story | ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా.  సెన్సిబుల్ అండ్ లవబుల్ సినిమాలకు పెట్టింది పేరైనా శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ చిత్రంపై ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తెలుగు దర్శకుల్లో తన దర్శకత్వ ప్రతిభతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్,  ఏయ్ పిల్లా పరుగున పోదామా’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటైంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులతో పాటు మరికొన్ని పనులు ఉండటంతో ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

    నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 10న 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కే.నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మాతలు.


    ఇక లవ్ స్టోరీలో హీరోగా నటించిన నాగ చైతన్య విషయానికొస్తే.. వరుసగా మజిలీ, వెంకీ మామ సక్సెస్‌లతో మంచి ఊపు మీదున్నాడు. ఇపుడు తన ఫ్యామిలీ ఇమేజ్‌కు తగ్గట్టు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు. . ‘లవ్ స్టోరీ’ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ఓ ఊరు నుంచి పట్నానికి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథ ఇది.. శేఖర్ కమ్ముల  ఈచిత్రాన్ని తనదైన వైలిలో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడుతాడట. చైతూ తెలంగాణ యాస ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు.  మరోవైపు సాయి పల్లవి కూడా మరోసారి తెలంగాణ అమ్మాయిగా నటించబోతుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు