• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMULA STARRER LOVE STORY MOVIE RELEASE DATE CONFIRMED PK

Naga Chaitanya - Sai Pallavi: నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Naga Chaitanya - Sai Pallavi: నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

నాగ చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ (Naga Chaitanya Sai Pallavi love story)

Naga Chaitanya - Sai Pallavi: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబైంది. భారీ అంచనాలున్న ఈ ప్రేమ కథ చిత్రాన్ని ఏప్రిల్ 16న..

  • Share this:
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబైంది. భారీ అంచనాలున్న ఈ ప్రేమ కథ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.. హాట్ సమ్మర్‌లో కూల్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయబోతున్నారు ప్రేక్షకులు. ఈ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి ఓ లవ్ లీ పోస్టర్‌ను వదిలింది టీమ్. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్, రీసెంట్‌గా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యేసరికి ఫ్యాన్స్ అంతా ఏప్రిల్ 16 కోసం వెయిట్ చేస్తున్నారు. లవ్ స్టోరీ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. ఫిదా లాంటి క్లాసిక్ తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 2017లో ఫిదా విడుదలైంది. అప్పటి నుంచి ఇదే సినిమాపై వర్క్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. సాయి పల్లవి మరోసారి కమ్ముల సినిమాలో నటిస్తుంది. మరి ఈ చిత్రంతో నాగ చైతన్య, సాయి పల్లవి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు