హోమ్ /వార్తలు /సినిమా /

Love Story : రెండు వారాల్లో 58 కోట్లను వసూలు చేసిన లవ్ స్టోరి.. ఇక అన్ని లాభాలే..

Love Story : రెండు వారాల్లో 58 కోట్లను వసూలు చేసిన లవ్ స్టోరి.. ఇక అన్ని లాభాలే..

11. లవ్ స్టోరి: వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ లవ్ స్టోరి సైతం ఆంధ్రలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. నైజాంలో ఈ సినిమాకు మార్జిన్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్రతో పాటు ఈస్ట్, వెస్ట్‌లో కూడా నష్టాలు తప్పలేదు. కరోనా కారణంగా అప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీ ఉండటంతో నష్టాలు తప్పలేదు. పాజిటివ్ టాక్ వచ్చాక కూడా లవ్ స్టోరి కొన్ని ఏరియాల్లో నష్టాల బారిన పడింది. 32 కోట్ల బిజినెస్ చేస్తే.. 33 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.

11. లవ్ స్టోరి: వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ లవ్ స్టోరి సైతం ఆంధ్రలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. నైజాంలో ఈ సినిమాకు మార్జిన్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్రతో పాటు ఈస్ట్, వెస్ట్‌లో కూడా నష్టాలు తప్పలేదు. కరోనా కారణంగా అప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీ ఉండటంతో నష్టాలు తప్పలేదు. పాజిటివ్ టాక్ వచ్చాక కూడా లవ్ స్టోరి కొన్ని ఏరియాల్లో నష్టాల బారిన పడింది. 32 కోట్ల బిజినెస్ చేస్తే.. 33 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.

Love Story : అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (love story) సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలై అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబడుతోంది.

ఇంకా చదవండి ...

అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది. లవ్ స్టోరి మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది.

ఇక లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సక్సెస్ ఫుల్‌గా ముగించింది. కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి అనుకోని అవరోధాల కారణంగా కలెక్షన్స్ తగ్గాయి. ఈ సినిమాకు గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ వలన కలెక్షన్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. ఇక లవ్ స్టోరి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో సినిమా 28.16 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. రెండో వారంలో 4.32 కోట్ల షేర్ అందుకుంది. ఇక 14 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 15 లక్షల వసూళ్లు చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ పూర్తి అయ్యి ప్రస్తుతం ప్రాఫిట్స్‌ను సొంతం చేసుకుంటుంది. టోటల్ వరల్డ్‌గా 58 కోట్ల మార్క్ గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

Maha Samudram : సెన్సార్ పూర్తి చేసుకున్న మహా సముద్రం.. అక్టోబర్ 14న గ్రాండ్ రిలీజ్..

మొత్తం మీద సినిమా 2 వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Nizam: 11.95Cr

Ceeded: 4.27Cr

UA: 2.87Cr

East: 1.56Cr

West: 1.32Cr

Guntur: 1.47Cr

Krishna: 1.32Cr

Nellore: 86L

AP-TG Total:- 25.62CR(41.70CR Gross)

Ka+ROI: 2.05Cr

OS – 4.81Cr~

Total WW: 32.48CR(58CR Gross)

ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 31.2 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి రెండు వారాల తర్వాత 48 లక్షల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ అనిపించుకుంది.

Samantha : విడాకుల తర్వాత మొదటిసారి సమంత ఫోటో షూట్.. అది మిస్ అయ్యిందిగా..

నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత ఈ సినిమా రావడం, దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడం, మరోవైపు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెంచాయి.

వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌‌కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.

First published:

Tags: Love story, Tollywood news

ఉత్తమ కథలు