Home /News /movies /

NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMULA LOVE STORY TWITTER REVIEW SR

Love Story Twitter Review : లవ్‌స్టోరి ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Love story Twitter Review Photo : Twitter

Love story Twitter Review Photo : Twitter

అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలవుతోంది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పటికే చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు.. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...
    అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలవుతోంది. అంటే ఈరోజునా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే.. నైజాంలో 240 థియేటర్స్ లో విడుదలవుతోంది. ఆంధ్రలో 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో లవ్ స్టోరి 640 థియేటర్స్ రిలీజ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 900 వరకు థియేటర్స్‌లో విడుదలకానుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అయ్యాయి.

    ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ అమెరికాలో కొన్ని గంటల కిందే పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అసలు సినిమా ఎలా ఉంది.. సాయి పల్లవి, నాగ చైతన్యల కెమిస్ట్రీ కుదిరిందా.. సినిమాలో కథేంటీ.. మొదలగు అంశాలను ట్విట్టర్ వేదికగా చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం...























    ఇక మరోవైపు ఈ సినిమా కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. సినిమాకి మొత్తం మీద 31.2 కోట్ల బిజినెస్ సొంతం అవ్వగా సినిమా ఇప్పుడు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది.

    Mahesh Babu - Srinu Vaitla : శ్రీను వైట్లతో దూకుడు సీక్వెల్‌కు మహేష్ బాబు ఓకే చెబుతారా.. ?

    హైదరాబాద్‌లో ఉన్న థియేటర్లలో మొదటి రోజు 245 షోలలో 85 షోలు బుకింగ్స్ అయ్యాయని తెలుస్తోంది. మహేష్ బాబు AMB సినిమాస్‌లో కూడా ఇప్పటికే 6,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీతో ముందుగానే థియేటర్లు ఫుల్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అదిరేపోయే ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

    ఇక ఈ సినిమాకు అమెరికాలో కూడా భారీ బుకింగ్స్ అయ్యాయని అంటున్నారు. ఇప్పటికే అక్కడ రెండు లక్షల డాలర్స్ మార్క్ ను కూడా క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. దీనిని బట్టి లవ్ స్టోరీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.

    Republic Pre Release Event : సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఛీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్..

    ఇక నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగాయి.

    వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల చేయనుంది చిత్రబృందం. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Love Story Movie, Naga Chaitanya, Sai Pallavi, Sekhar kammula, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు