Love Story : రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న లవ్ స్టోరి ట్రైలర్.. సెన్సార్ సభ్యుల ప్రశంసలు..

Naga Chaitanya Sai Pallavi Sekhar kammula love story Photo : Twitter

Love Story : అక్కినేని నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

 • Share this:
  అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలకానుంది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. తాజాగా విడుదల అయిన ట్రైలర్ కి నెటిజన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ ఇప్పటి వరకు 5 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో అదరగొడుతోంది. లవ్ స్టోరీ ట్రైలర్ 24 గంటల్లో 342కే లైక్స్ ను సొంతం చేసుకుని టాప్ ఫైవ్ లైక్స్ వచ్చిన ట్రైలర్ లలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. వకీల్ సాబ్, బాహుబలి, సాహో, సరిలేరు నీకెవ్వరు సినిమాల తర్వాత లవ్ స్టోరీ ఎక్కువగా లైక్స్ పొందిన ట్రైలర్‌గా నిలిచింది.

  ఇక ఈ నెల 24న విడుదలకానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ప్రశంసిస్తూ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. లవ్ స్టోరీ 2 గంటల 25 నిమిషాలుగా ఉన్నట్టు తెలుస్తోంది.


  ఇక నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగాయి.


  వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది.

  తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల చేయనుంది చిత్రబృందం. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు.

  ఇక లవ్ స్టోరి కథ విషయానికి వస్తే.. ఈ సినిమాను శేఖర్ కమ్ముల హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కించారు. గతంలో కూడా బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్‌ను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఆయన సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు.

  ఇక ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది.

  ఈ తాజా సినిమాకు కూడా ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ ఉందట. దానికి తోడు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా సినిమాకు మంచి హైప్ రావడానికి కారణం అవుతోంది. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.
  Published by:Suresh Rachamalla
  First published: