Home /News /movies /

NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMULA LOVE STORY TO STREAM ON AHA OCTOBER 22 DATE CONFIRMED SR

Love Story on Aha : ఆహాలో లవ్ స్టోరి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

Love story on aha Photo : Twitter

Love story on aha Photo : Twitter

Love Story on Aha : అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (love story) సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలై అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో తాజాగా ఖరారు అయ్యింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది.

ఇంకా చదవండి ...
    అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు ఇప్పటికే ముప్పై రెండు కోట్ల షేర్ సాధించి.. ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుందా.. అని కొందరు సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను (Aha) ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా ఆహాలో అక్టోబర్ 22న స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ స్టార్ మా (Star Maa) సొంతం చేసుకుంది.

    ఇక లవ్ స్టొరీ చేసిన బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది.

    Balakrishna | Akhanda : బాలకృష్ణపై భారీ ఆశలు పెట్టుకున్న దిల్ రాజు.. అఖండ నైజాం రైట్స్ అంత ధర పలికాయా...

    ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది.


    ఇక లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సక్సెస్ ఫుల్‌గా ముగించింది. కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి అనుకోని అవరోధాల కారణంగా కలెక్షన్స్ తగ్గాయి. ఈ సినిమాకు గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ వలన కలెక్షన్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. ఇక లవ్ స్టోరి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో సినిమా 28.16 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. రెండో వారంలో 4.32 కోట్ల షేర్ అందుకుంది. లవ్ స్టోరి సినిమా 21 వ రోజు 9 లక్షల షేర్ ని అందుకుంటే 22 వ రోజు 18 లక్షల షేర్‌ అందుకుంది.

    Natyam Pre Release Event : నాట్యం ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన రామ్ చరణ్..

    ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 31.2 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి మూడు వారాల తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించి.. 2.13 కోట్ల ప్రాఫిట్‌తో దూసుకుపోతోంది. నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత ఈ సినిమా రావడం, దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడం, మరోవైపు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెంచాయి.

    ఇక ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్ని పోషించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Aha OTT Platform, Love Story Movie, Naga Chaitanya, Tollywood news

    తదుపరి వార్తలు