NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMULA LOVE STORY TO STREAM ON AHA FROM THIS FESTIVAL HERE ARE THE DETAILS SR
Love Story on Aha : ఆహాలో నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే...
Love story on Aha Photo : Twitter
Love Story : అక్కినేని హీరో నాగ చైతన్య, (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (love story) సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలై అదరగొడుతోన్న సంగతి తెలిసిందే.
అక్కినేని హీరో నాగ చైతన్య, (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వస్తుందా.. అని కొందరు సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను (Aha) ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందనే విషయంలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే సినిమా విడుదలైన యాబై రోజులకు అందుబాటులోకి రానుందని సమాచారం. దీంతో లవ్ స్టోరి దీపావళీ కానుకగా స్ట్రీమింగ్ కావోచ్చని చర్చించుకుంటున్నారు నెటిజన్స్.. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా (Star Maa) సొంతం చేసుకుంది.
ఇక లవ్ స్టొరీ చేసిన బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది.
ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అయ్యాయి.
ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది.
ఇక లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సక్సెస్ ఫుల్‌గా ముగించింది. కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకోని అవరోధాల కారణంగా కలెక్షన్స్ తగ్గాయి. ఈ సినిమాకు 4 వ రోజు నుండి గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ వలన కలెక్షన్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. ఈ సినిమా ఐదవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. 4 వ రోజు 2.52 కోట్ల షేర్ ని అందుకున్న లవ్స్ స్టోరి సినిమా అయిదవ రోజున కేవలం 1.26 కోట్ల షేర్ సాధించింది. ఆరవ రోజున 66 లక్షలు, ఏడవ రోజున 39 లక్షల షేర్‌ను వసూలు చేసింది. ఇక ఏడు రోజుల మొత్తం ఏపీ తెలంగాణలో 22.23CR షేర్ 36.10CR గ్రాస్‌ను వసూలు చేసిందని తెలుస్తోంది.
ఇక లవ్ స్టోరీ 7 డేస్ మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌ను చూస్తే..
Nizam: 10.58Cr
Ceeded: 3.56Cr
UA: 2.48Cr
East: 1.35Cr
West: 1.13Cr
Guntur: 1.30Cr
Krishna: 1.12Cr
Nellore: 71L
AP-TS మొత్తం:- 22.23CR (36.10CR గ్రాస్)
Ka+ROI: 1.42Cr ~
OS- 4.51Cr ~
వరల్డ్ వైడ్ మొత్తం : 28.16CR (50.05CR ~ గ్రాస్)
ఈ సినిమాను టోటల్ గా 31.2 కోట్లకి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే వారం రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.84 కోట్ల షేర్ అందుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.
ఇక ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్ని పోషించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.