హోమ్ /వార్తలు /సినిమా /

Love Story on Aha : ఆహాలో నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరి.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు...

Love Story on Aha : ఆహాలో నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరి.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు...

ఈ మధ్య తెలుగు సినిమాలకు ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. మన సినిమాలను చూసి వాళ్ళు కథలు రాసుకుంటున్నారు. ఇక మన హీరోలు కూడా ఇతర ఇండస్ట్రీలపై సీరియస్ గా కన్నేశారు. అందుకే మన సినిమాలు వరుసగా ఇతర భాషల్లో కూడా విడుదల అవుతున్నాయి. తాజాగా లవ్ స్టోరీ సినిమా విషయంలో కూడా ఇదే చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ మధ్య తెలుగు సినిమాలకు ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. మన సినిమాలను చూసి వాళ్ళు కథలు రాసుకుంటున్నారు. ఇక మన హీరోలు కూడా ఇతర ఇండస్ట్రీలపై సీరియస్ గా కన్నేశారు. అందుకే మన సినిమాలు వరుసగా ఇతర భాషల్లో కూడా విడుదల అవుతున్నాయి. తాజాగా లవ్ స్టోరీ సినిమా విషయంలో కూడా ఇదే చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Love Story on Aha : అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (love story) సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలై అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారు అయ్యింది.

ఇంకా చదవండి ...

    అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు ఇప్పటికే ముప్పై రెండు కోట్ల షేర్ సాధించి.. ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుందా.. అని కొందరు సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను (Aha) ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా ఆహాలో అక్టోబర్ 22న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ స్టార్ మా (Star Maa) సొంతం చేసుకుంది.

    ఇక లవ్ స్టొరీ చేసిన బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది.

    ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది.

    ఈ సినిమాకు 4 వ రోజు నుండి గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ వలన కలెక్షన్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 31.2 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి రెండు వారాల తర్వాత 77 లక్షల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది.

    ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్న లవ్ స్టోరి లాభాలతో మూడో వారంలో ఎంటర్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 16 వ రోజుకు 15 లక్షల షేర్‌ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 17 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

    వరల్డ్ వైడ్‌ 16 రోజుల కలెక్షన్స్ …

    Nizam: 12.02Cr

    Ceeded: 4.32Cr

    UA: 2.90Cr

    East: 1.58Cr

    West: 1.34Cr

    Guntur: 1.49Cr

    Krishna: 1.35Cr

    Nellore: 87L

    AP-TG Total:- 25.87CR(42.10CR Gross)

    Ka+ROI: 2.07Cr

    OS – 4.83Cr

    Total WW: 32.77CR(58.55CR Gross)

    ఇక ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్ని పోషించారు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Aha OTT Platform, Love Story Movie, Tollywood news

    ఉత్తమ కథలు