Love Story : వినాయక చవితికి రెడీ అవుతోన్న నాగ చైతన్య సాయిపల్లవిల లవ్ స్టోరి..

Love story Photo : Twitter

Love Story : అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

 • Share this:
  అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుండగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. కేసులు ఎక్కువవుతుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసుల ఉధృతిని దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16న విడుదలకావాల్సిన లవ్ స్టోరి విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. పాటలు, టీజర్ వంటి వాటితో ఈ సినిమాకు కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. ఇక గత నెలలో సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో చిన్న చిన్న సినిమాలన్ని వరుసపెట్టి రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండడంతో “లవ్ స్టోరీ” సినిమా కూడా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుందన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా వచ్చే నెల 10వ తేదీన విడుదల చేయాలనీ చూస్తోందట చిత్రబృందం. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

  ఇక నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగాయి. వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  రెండు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల చేయనుంది చిత్రబృందం. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు.

  ఇక లవ్ స్టోరి కథ విషయానికి వస్తే.. ఈ సినిమాను శేఖర్ కమ్ముల హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కించారు. గతంలో కూడా బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్‌ను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఆనంద్'. ఈ సినిమాతో శేఖర్ తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసారు. ఆయన సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు.

  ఇక ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తాజా సినిమాకు కూడా ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ ఉందట. దానికి తోడు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా సినిమాకు మంచి హైప్ రావడానికి కారణం అవుతోంది. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.

  ఇవి కూడా చూడండి :

  Poorna : పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

  RRR : అర్ధనగ్నంగా పోజులిచ్చిన ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఆలియా భట్.. పిక్స్ వైరల్..

  Anchor Varshini : బికినీలో యాంకర్ వర్షిణి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

  Premi Viswanath : బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మెరిసిపోతున్న వంటలక్క...

  Anchor Vishnupriya : లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..
  Published by:Suresh Rachamalla
  First published: