Home /News /movies /

NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMULA LOVE STORY SEVEN DAYS COLLECTIONS SR

Love Story : లవ్ స్టోరి ఏడు రోజుల కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే..

Love Story Collections Photo : Twitter

Love Story Collections Photo : Twitter

Love Story : అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (love story) సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలై అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబడుతోంది. ఏడు రోజులకు ఈ సినిమా దాదాపు ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇంకా చదవండి ...
    అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది. ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది.

    ఇక లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సక్సెస్ ఫుల్‌గా ముగించింది. కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి అనుకోని అవరోధాల కారణంగా కలెక్షన్స్ తగ్గాయి. ఈ సినిమాకు 4 వ రోజు నుండి గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ వలన కలెక్షన్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. ఈ సినిమా ఐదవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. 4 వ రోజు 2.52 కోట్ల షేర్ ని అందుకున్న లవ్స్ స్టోరి సినిమా అయిదవ రోజున కేవలం 1.26 కోట్ల షేర్ సాధించింది.

    లవ్ స్టోరీ డే వైజ్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్
    మొదటి రోజు - 7.13Cr
    రెండవ రోజు- 5.08Cr
    మూడోవ రోజు- 5.19Cr
    నాల్గవ రోజు- 2.52Cr
    ఐదవ రోజు- 1.26Cr
    ఆరవ రోజు- 66L
    ఏడవ రోజు - 39L

    ఏపీ తెలంగాణ మొత్తం:- 22.23CR (36.10CR ross స్థూల)

    ఇక్కడ లవ్ స్టోరీ 7 డేస్ మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
    Nizam: 10.58Cr
    Ceeded: 3.56Cr
    UA: 2.48Cr
    East: 1.35Cr
    West: 1.13Cr
    Guntur: 1.30Cr
    Krishna: 1.12Cr
    Nellore: 71L
    AP-TS మొత్తం:- 22.23CR (36.10CR గ్రాస్)
    Ka+ROI: 1.42Cr ~
    OS- 4.51Cr ~
    వరల్డ్ వైడ్ మొత్తం : 28.16CR (50.05CR ~ గ్రాస్)

    ఈ సినిమాను టోటల్ గా 31.2 కోట్లకి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే వారం రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.84 కోట్ల షేర్ అందుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.





    ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అయ్యాయి.

    నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగాయి.

    వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Love Story Movie, Naga Chaitanya, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు