• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMULA LOVE STORY MOVIE DELAYED DUE TO COVID 19 PANDEMIC SECOND WAVE TA

Love Story Movie Postponed: పోస్ట్ పోన్ అయిన నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ మూవీ. .

నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ మూవీ (Twitter/Photo)

Love Story Movie Postponed: పోస్ట్ పోన్ అయిన నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ మూవీ. మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త రెండు వారాలుగా  దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

  • Share this:
    Love Story Movie Postponed: పోస్ట్ పోన్ అయిన నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ మూవీ. మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త రెండు వారాలుగా  దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రోజు వారి కేసుల్లో పెరుగుదల లక్ష దాటింది.  ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే పలువరు బాలీవుడ్ నటులు  అక్షయ్ కుమార్, గోవిందా, ఆమీర్ ఖాన్, మాధవన్, విక్కీ కౌశల్ కత్రినా, నగ్మా సహా పలువురు సెలబ్రిటీలో కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఇప్పటికే విడుదల కావాల్సిన అక్షయ్ కుమార్ ‘సూర్య వంశీ’ కంగనా రనౌత్.. ‘తలైవి’, 83 వంటి సినిమాల విడుదల తేదిలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ జాబితాలో తెలుగులో సూపర్ హిట్ మూవీ ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

    కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో ‘లవ్ స్టోరీ’ సినిమా మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ సినిమాను ఈ నెల 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ఉదృతి నేపథ్యంలో విడుదలను వాయిదా వేసారు. ఇప్పటికే నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. కరోనా కారణంగా కలెక్షన్లు లేవు. పైగా ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్స్‌కు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేసారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తున్నట్టు ప్రకటించారు.


    ‘లవ్ స్టోరీ’ సినిమా విషయానికొస్తే..  ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేసాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.

    ‘లవ్ స్టోరీ’ మూవీ మేకర్స్ (Twitter/Photo)


    ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ సంచలన పాయింట్ చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు చెప్పిన కథను ఇందులో చూపించబోతున్నాడు. దానికి ప్రేమకథను జోడించి కథ తెరకెక్కిస్తున్నాడు. ప్రతీ అమ్మాయి తమ యవ్వన దశలో ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యను ఈ సినిమాలో చూపించబోతున్నాడు కమ్ముల. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు. ఈ సినిమాలోని సారంగదరియా పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ (10 కోట్లు) మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపుతూనే ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: