Love Story : లవ్‌స్టోరికి భారీ బుకింగ్స్.. అమెరికాలో అప్పుడే రెండు లక్షల మార్క్..

Love Story Poster Photo : Twitter

Love Story : నాగ చైతన్య, సాయి పల్లవిలు ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న “లవ్ స్టోరీ” ఇంకొన్ని గంటల్లో విడుదల కానుంది. మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకు అప్పుడే ఓ రేంజ్‌లో బుకింగ్స్ మొదలైయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాకు అమెరికాలో ఓ రేంజ్‌లో డిమాండ్ ఉందని తెలుస్తోంది.

 • Share this:
  అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలకానుంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి.

  ఇక మరోవైపు ఈ సినిమా కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. సినిమాకి మొత్తం మీద 31.2 కోట్ల బిజినెస్ సొంతం అవ్వగా సినిమా ఇప్పుడు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. ఇక ఈ సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే.. నైజాంలో 240 థియేటర్స్ లో విడుదలవుతోంది. ఆంధ్రలో 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాలలో లవ్ స్టోరి 640 థియేటర్స్ రిలీజ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 900 వరకు థియేటర్స్‌లో విడుదలకానుంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అయ్యాయి.


  హైదరాబాద్‌లో ఉన్న థియేటర్లలో మొదటి రోజు 245 షోలలో 85 షోలు బుకింగ్స్ అయ్యాయని తెలుస్తోంది. మహేష్ బాబు AMB సినిమాస్‌లో కూడా ఇప్పటికే 6,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీతో ముందుగానే థియేటర్లు ఫుల్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అదిరేపోయే ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

  MAA Elections: రంజుగా మా ఎన్నికలు... మంచు విష్ణు ప్యానల్‌లో సభ్యులు వీరే..

  ఇక ఈ సినిమాకు అమెరికాలో కూడా భారీ బుకింగ్స్ అయ్యాయని అంటున్నారు. ఇప్పటికే అక్కడ రెండు లక్షల డాలర్స్ మార్క్ ను కూడా క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. దీనిని బట్టి లవ్ స్టోరీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.

  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. తాజాగా విడుదల అయిన ట్రైలర్ కి నెటిజన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ ఇప్పటి వరకు 6 మిలియన్ పైగా వ్యూస్‌తో అదరగొడుతోంది. లవ్ స్టోరీ ట్రైలర్ 24 గంటల్లో 342కే లైక్స్ ను సొంతం చేసుకుని టాప్ ఫైవ్ లైక్స్ వచ్చిన ట్రైలర్ లలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. వకీల్ సాబ్, బాహుబలి, సాహో, సరిలేరు నీకెవ్వరు సినిమాల తర్వాత లవ్ స్టోరీ ఎక్కువగా లైక్స్ పొందిన ట్రైలర్‌గా నిలిచింది.

  Sai Pallavi: ఆరోజు రాత్రి షూటింగ్.. వచ్చి నా చెయ్యి పట్టుకున్నారంటూ సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్?

  ఇక ఈ నెల 24న విడుదలకానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ప్రశంసిస్తూ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. లవ్ స్టోరీ 2 గంటల 25 నిమిషాలుగా ఉన్నట్టు తెలుస్తోంది.

  ఇక నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగాయి.

  సారంగ దరియా సాంగ్..

  వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల చేయనుంది చిత్రబృందం. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు.

  లవ్ స్టోరి కథ విషయానికి వస్తే..

  ఇక లవ్ స్టోరి కథ విషయానికి వస్తే.. ఈ సినిమాను శేఖర్ కమ్ముల హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కించారు. గతంలో కూడా బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్‌ను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఆయన సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు
  Published by:Suresh Rachamalla
  First published: