NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMULA LOVE STORY FIRST DAY COLLECTIONS SR
Love Story : మొదటి రోజు కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర లవ్ స్టోరి ప్రభంజనం..
Love Story first day Collections Photo : Twitter
Love Story : అక్కినేని హీరో నాగ చైతన్య, (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (love story) సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలై మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది.
అక్కినేని హీరో నాగ చైతన్య, (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసిందని అంటున్నారు. ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.5 కోట్ల మార్క్ ని అందుకుందని అంటున్నారు.
మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్…
Nizam: 3.06Cr
Ceeded: 1.08Cr
UA: 61L
East: 48L(14L hires)
West: 55L(24L hires)
Guntur: 59L(16L hires)
Krishna: 32L
Nellore: 25L
AP-TG Total:- 6.94CR(10.35CR~ Gross)(54L hires)
Ka+ROI: 32L~
OS – 2.40Cr~
Total WW: 9.66CR(16.5CR~ Gross)
ఇక ఈ సినిమాను టోటల్ గా 31.2 కోట్లకి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మరో 22.34 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సంవత్సరంలో ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కూడా కలెక్ట్ చేయని మొత్తాన్ని తన ఖాతాలో వేసకుకుందని తెలుస్తోంది. అమెరికాలో ప్రిమియర్స్ పరంగా 2021లో ఇండియాలో ఏ సినిమాకు రాని కలెక్షన్స్ ఈ లవ్ స్టోరికి వచ్చాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి చిత్రబృందం ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. అంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌కు అన్ని కలెక్షన్స్ రాలేదన్నామాట. దీంతో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అయ్యాయి.
నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ కావడం కారణంగా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెరిగాయి.
వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించింది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.