NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMULA LOVE STORY BECOMES FLOP IN ANDHRA PRADESH FOR THIS REASON HERE ARE THE DETAILS SR
Love Story : ఆంధ్రలో నష్టాలను మిగిల్చిన లవ్ స్టోరి.. తెలంగాణలో మాత్రం సూపర్ హిట్.. కారణం ఇదే..
Love Story Poster Photo : Twitter
Love Story : ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఇప్పటికే ముప్పై రెండు కోట్లకు పైగా షేర్ సాధించి.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలను తెచ్చింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఆంధ్రలో నష్టాలను తెచ్చిందని అంటున్నారు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
అక్కినేని హీరో నాగ చైతన్య, (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఇప్పటికే ముప్పై రెండు కోట్లకు పైగా షేర్ సాధించి.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలను తెచ్చింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఆంధ్రలో నష్టాలను తెచ్చిందని అంటున్నారు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీతో పాటు టికెట్ రేట్ల వలన ఇబ్బందులను ఎదురుకున్న ఈ సినిమా షోలు 100% ఆక్యుపెన్సీతో వాడుకున్నా కలెక్షన్స్ మాత్రం 50% ఆక్యుపెన్సీకే రిపోర్ట్ చేస్తూ వచ్చారట. దీంతో వైజాగ్ ఏరియాలో 3.25 కోట్ల బిజినెస్ అయితే 3.15 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఈస్ట్లోను 2.4 కోట్ల బిజినెస్ అయితే 1.74 కోట్లు షేర్ వచ్చింది. వెస్ట్ ఏరియాకి 2 కోట్లకి 1.48 కోట్ల షేర్ వచ్చింది. గుంటూరు ఏరియాకి 2.5 కోట్లకి బిజినెస్ జరిగితే 1.59 కోట్ల షేర్ వచ్చింది.
ఇలా అన్ని ఏరియాల్లో 50% రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ వలన అక్కడ నష్టాలను సొంతం చేసుకుంది లవ్ స్టోరి. ఓవరాల్‌గా ఆంధ్రలో 13.15 కోట్ల బిజినెస్ కి సినిమా 10.40 కోట్లు మాత్రమే రికవరీ అయ్యిందని అంటున్నారు. దీంతో తెలంగాణలో సూపర్ హిట్ అయిన లవ్ స్టోరి ఆంధ్రలో 2.75 కోట్ల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను (Aha) ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా ఆహాలో అక్టోబర్ 22న నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా (Star Maa) సొంతం చేసుకుంది.
ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 31.2 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి మూడు వారాల తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించి.. 2.13 కోట్ల ప్రాఫిట్‌తో అదరగొట్టింది. నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత ఈ సినిమా రావడం, దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడం, మరోవైపు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెంచాయి.
ఇక ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్ని పోషించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.