Home /News /movies /

NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMULA LOVE STORY 22 DAYS COLLECTIONS HERE ARE THE FULL DETAILS SR

Love Story : లవ్ స్టోరి 22 రోజుల కలెక్షన్స్.. రెండు కోట్ల లాభాలతో..

Love Story Poster Photo : Twitter

Love Story Poster Photo : Twitter

Love Story : అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (love story) సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలై అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబడుతోంది.

ఇంకా చదవండి ...
    అక్కినేని హీరో నాగ చైతన్య,  (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది. లవ్ స్టోరి మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది.

    ఇక లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సక్సెస్ ఫుల్‌గా ముగించింది. కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి అనుకోని అవరోధాల కారణంగా కలెక్షన్స్ తగ్గాయి. ఈ సినిమాకు గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ వలన కలెక్షన్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. ఇక లవ్ స్టోరి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో సినిమా 28.16 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. రెండో వారంలో 4.32 కోట్ల షేర్ అందుకుంది. లవ్ స్టోరి సినిమా 21 వ రోజు 9 లక్షల షేర్ ని అందుకుంటే 22 వ రోజు 18 లక్షల షేర్‌ అందుకుంది.

    ఈ లవ్ స్టోరి సినిమా 22 రోజుల టోటల్ కలెక్షన్స్…
    Nizam: 12.47Cr
    Ceeded: 4.41Cr
    UA: 3.08Cr
    East: 1.70Cr
    West: 1.45Cr
    Guntur: 1.57Cr
    Krishna: 1.48Cr
    Nellore: 92L
    AP-TG Total:- 27.08CR(44.15CR Gross)
    Ka+ROI: 2.15Cr
    OS – 4.90Cr
    Total WW: 34.13CR(61CR Gross)

    ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 31.2 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి మూడు వారాల తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించి.. 2.13 కోట్ల ప్రాఫిట్‌తో దూసుకుపోతోంది.

    Kandikonda : సినీ గేయ రచయిత కందికొండను కాపాడుకుందాం... ఆర్థికంగా ఆదుకోవాలంటూ...

    నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత ఈ సినిమా రావడం, దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడం, మరోవైపు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెంచాయి.

    వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌‌కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Love story, Naga Chaitanya, Sai Pallavi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు