అక్కినేని హీరో నాగ చైతన్య, (Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది. లవ్ స్టోరి మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని తెలుస్తోంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది.
ఇక లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సక్సెస్ ఫుల్‌గా ముగించింది. కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి అనుకోని అవరోధాల కారణంగా కలెక్షన్స్ తగ్గాయి. ఈ సినిమాకు గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ వలన కలెక్షన్స్‌కి గట్టి దెబ్బే తగిలింది. ఇక లవ్ స్టోరి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో సినిమా 28.16 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. రెండో వారంలో 4.32 కోట్ల షేర్ అందుకుంది.
Balakrishna : షూటింగ్ స్పాట్‌లో గాయపడ్డ బాలకృష్ణ.. ఆందోళనలో అభిమానులు..
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్న లవ్ స్టోరి లాభాలతో మూడో వారంలో ఎంటర్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 15 వ రోజు 10 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 12 లక్షల దాకా షేర్‌ను సొంతం చేసుకుంది.
15 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
Nizam: 11.98Cr
Ceeded: 4.29Cr
UA: 2.88Cr
East: 1.57Cr
West: 1.33Cr
Guntur: 1.48Cr
Krishna: 1.33Cr
Nellore: 86L
AP-TG Total:- 25.72CR(41.86CR Gross)
Ka+ROI: 2.06Cr
OS – 4.82Cr
Total WW: 32.60CR(58.20CR Gross)
ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 31.2 కోట్లకు అమ్మగా సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి రెండు వారాల తర్వాత 60 లక్షల ప్రాఫిట్ తో రన్ అవుతుంది.
Rashmika Mandanna : మరోసారి అదరగొట్టిన రష్మిక మందన.. లేటెస్ట్ పిక్స్ చూశారా...
నాగచైతన్య ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి విజయాల తర్వాత ఈ సినిమా రావడం, దీనికితోడు ‘ఫిదా’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కావడం, మరోవైపు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెంచాయి.
వీటికి తోడు, ఈ సినిమాలో పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం కూడా మంచి పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమాలో ఆ మధ్య విడుదలైన తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించింది. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ చిల్లం ఈ సినిమాకు సంగీతం అందించారు. రావు రమేష్, దేవయాని, ఉత్తేజ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love Story Movie, Tollywood news