Home /News /movies /

NAGA CHAITANYA SAI PALLAVI SEKHAR KAMMMULA LOVE STORY TEASER RELEASED TA

Naga Chaitanya -Sai Pallavi - Love Story Teaser: నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ టీజర్‌ విడుదల.. ఎలా ఉందంటే..

నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ టీజర్ టాక్ (Twitter/Photo)

నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ టీజర్ టాక్ (Twitter/Photo)

Naga Chaitanya -Sai Pallavi - Sekhar Kammula - Love Story Teaser: | ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా.  తాజాగా ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
    Naga Chaitanya -Sai Pallavi - Sekhar Kammula - Love Story Teaser: | ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా.  సెన్సిబుల్ అండ్ లవబుల్ సినిమాలకు పెట్టింది పేరైనా శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ చిత్రంపై ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తెలుగు దర్శకుల్లో తన దర్శకత్వ ప్రతిభతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్,  ఏయ్ పిల్లా పరుగున పోదామా’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను కాసేటి క్రితమే విడుదల చేసారు. ఈ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్‌లో జీరో కెళ్లి  వచ్చానా సార్.. శానా కష్టపడతా సార్.. మంచి ప్లాన్ ఉంది అంటూ ఉద్యోగం కోసే పాటు పడే రేవంత అనే యువకుడుగా నాగ చైతన్య.. మరోవైపు జాబ్ గ్యారంటీ వస్తుందనుకున్న ఓ మౌనిక అనే అమ్మాయిగా సాయి పల్లవి నటించింది. టీజర్‌లో నాగ చైతన్య .. ఆ సాఫ్ట్ వేర్ జాబ్ ఏం చేస్తావ్.. కళ్లాద్దాలు వస్తాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది.. జుట్టు మొత్తం ఊశిపోతుంది అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది.

    మొత్తంగా నాగ చైతన్య తెలంగాణ యువకుడిగా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. జీవిత పోరాటంలో గెలవాలనుకునే ఇద్దరు యువతీ యువకులు.. తమ గమ్యాన్ని చేరుకోవడంతో పాటు తమ లవ్ స్టోరీని ఏ విధంగా సక్సెస్ చేసుకున్నారనే పాయింట్ పై శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది. పూర్తి మధ్య తరగతి నేపథ్యంలో ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించాడు.

    ముందుగా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేటవ్వడంతో  ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక లవ్ స్టోరీలో హీరోగా నటించిన నాగ చైతన్య విషయానికొస్తే.. వరుసగా మజిలీ, వెంకీ మామ సక్సెస్‌లతో మంచి ఊపు మీదున్నాడు. ఇపుడు తన ఫ్యామిలీ ఇమేజ్‌కు తగ్గట్టు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేసాడు.ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Love Story Movie, Naga Chaitanya Akkineni, Sai Pallavi, Sekhar kammula, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు