తెలంగాణ పల్లెలో నాగచైతన్య, సాయిపల్లవి సందడి

సుస్వాగతం సినిమా హీరోయిన్‌గా నటించిన దేవయాని, రాంబంటు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ శ్వరిరావ్‌ హీరో, హీరోయిన్‌ల తల్లి పాత్రలను పోషిస్తున్నారు.

news18-telugu
Updated: December 24, 2019, 11:06 AM IST
తెలంగాణ పల్లెలో నాగచైతన్య, సాయిపల్లవి సందడి
సుస్వాగతం సినిమా హీరోయిన్‌గా నటించిన దేవయాని, రాంబంటు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ శ్వరిరావ్‌ హీరో, హీరోయిన్‌ల తల్లి పాత్రలను పోషిస్తున్నారు.
  • Share this:
అక్కినేని నాగచైతన్య, ఫిదా హీరోయిన్ సాయిపల్లవి తెలంగాణ పల్లెల్లో సందడి చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ మండలం పిప్రి గ్రామంలో చైతూ, సాయిపల్లవి సోమవారం వెళ్లారు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో కుంటుంబ కథ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నా రు. అయితే ఆ సిినిమాలో సన్నివేశాల కోసం గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా గడ్డం నడ్పి రాజన్న అనే రైతు ఇంట్లో షూటింగ్ తీస్తున్నారు. ఈ మూవీలో సుస్వాగతం సినిమా హీరోయిన్‌గా నటించిన దేవయాని, రాంబంటు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ శ్వరిరావ్‌ హీరో, హీరోయిన్‌ల తల్లి పాత్రలను పోషిస్తున్నారు.

సాయి పల్లవి నాగచైతన్య సినిమా ఓపెనింగ్ (Source: Twitter)


షూటింగ్‌లో భాగంగా హీరో, హీరోయిన్‌ కుటుంబాల మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత ఫిబ్రవరిలో పిప్రిలో చిత్రీకరించిన సన్నివేశాల్లో మార్పులు జరగడం వల్ల సినిమాను రీ షూటింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. . డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈసినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు శేఖర్ ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ గా అయింది.

First published: December 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు