Naga Chaitanya-Sai Pallavi : లీకైనా నాగ చైతన్య, సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్..

Naga Chaitanya-Sai Pallavi : నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరి పేరుతో శేఖర్ కమ్ముల ఓ సినిమాను సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 16, 2020, 3:00 PM IST
Naga Chaitanya-Sai Pallavi : లీకైనా నాగ చైతన్య, సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్..
నాగ చైతన్య, సాయి పల్లవి Photo : Twitter
  • Share this:
నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరి పేరుతో శేఖర్ కమ్ముల ఓ సినిమాను సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శేఖర్ 'ఆనంద్' అనే సినిమాతో తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసిన దర్శకుడు. ఆయన సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నాడు. తన తాజా చిత్రాన్ని నాగ చైతన్య సాయి పల్లవిలు హీరో హీరోయిన్స్‌గా ఓ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. దాదాపు రెండు నెలల నుండి పెద్ద సినిమాలేవి షూటింగ్ జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్‌తో షూటింగ్ జరుపుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ ను ప్రారంభించింది చిత్రబృందం. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రారంభమైన షెడ్యూల్ కు సంబంధించిన ఫొటోలు నెట్ లోకి వచ్చేశాయి. తాజాగా గండికోటలో ఈ సినిమాకు సంబందించిన ఓ పాటను షూటింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏకంగా వీడియోలే ప్రత్యక్షమైపోయాయి. లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ఇది ఆఖరి షెడ్యూల్. మరో వారం రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తయిపోతుందని సమాచారం. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని, థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్రబృందం క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తాజా సినిమాకు కూడా ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ ఉందట. దానికి తోడు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా సినిమాకు మంచి హైప్ రావడానికి కారణం అవుతోంది. ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: September 16, 2020, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading