‘లవ్ స్టోరీ’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్ (Twitter/Photo)
Naga Chaitanya Sai Pallavi Sekhar Kammula Love Story | ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కావడంతో ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసారు.
Naga Chaitanya Sai Pallavi Sekhar Kammula Love Story | ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా. సెన్సిబుల్ అండ్ లవబుల్ సినిమాలకు పెట్టింది పేరైనా శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ చిత్రంపై ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తెలుగు దర్శకుల్లో తన దర్శకత్వ ప్రతిభతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ఏయ్ పిల్లా పరుగున పోదామా’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటైనట్టు దర్శకుడు శేఖర్ కమ్ముల తెలియజేసాడు. దీంతో ‘లవ్ స్టోరీ’ సినిమాకు చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, శేఖర్ మాస్టర్ సినిమా కంప్లీట్ అయినట్టు చేతులతో థమ్స్ అప్ సిగ్నల్ ఇచ్చారు.
#LoveStory completes shoot and getting ready for release.
More details soon!
నాగ చైతన్య విషయానికొస్తే.. వరుసగా మజిలీ, వెంకీ మామ సక్సెస్‌లతో మంచి ఊపు మీదున్నాడు. ఇపుడు తన ఫ్యామిలీ ఇమేజ్‌కు తగ్గట్టు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు. తాజాగా విడులైన ఈ పాటను పింగళి చైతన్య మంచి సాహిత్యాన్ని అందించాడు. ‘లవ్ స్టోరీ’ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ఓ ఊరు నుంచి పట్నానికి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథ ఇది.. శేఖర్ కమ్ముల ఈచిత్రాన్ని తనదైన వైలిలో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడుతాడట. చైతూ తెలంగాణ యాస ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. మరోవైపు సాయి పల్లవి కూడా మరోసారి తెలంగాణ అమ్మాయిగా నటించబోతుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.