NAGA CHAITANYA REFUSED TO ANSWERS ABOUT SAMANTHA IN NO 1 YAARI SHOW NR
No. 1 Yaari: ఈ ఇంటర్వ్యూ సమంత చూస్తుంది.. అన్నీ చెప్పలేం: నాగచైతన్య
naga chaithanya
No. 1 Yaari: ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16వ తేదీన విడుదల అవ్వాల్సి ఉండగా మే 7వ తేదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
No. 1 Yaari: ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16వ తేదీన విడుదల అవ్వాల్సి ఉండగా మే 7వ తేదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రానా వ్యాఖ్యాతగా తెరకెక్కుతున్న నెంబర్ వన్ యారి షోకు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, నాగ చైతన్య వచ్చారు. .
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. అందులో హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవితో పాటు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా పాల్గొన్నారు. ఇక రానా వాళ్ల ఎంట్రీతోనే కాస్త ఎంటర్టైన్మెంట్ చేశాడు. రానా డైరెక్టర్ తో సెలబ్రిటీ క్రష్ ఎవరు అనగా.. వెంటనే నాగ చైతన్య సెలబ్రిటీ క్రషా? అంటూ షాక్ అయ్యాడు. ఇక తర్వాత నాగచైతన్యను ఎవరినైన మిస్ అవుతున్నావా అని రానా అడగగా.. చాలా అంటూ చైతన్య సమాధానమిచ్చాడు.
దీంతో ఇంట్లో టీవీలో ఈ షో అందరూ చూస్తారు. శ్యామ్ చూస్తుంది అంటూ.. ఈ షో ద్వారా నన్ను పిలిచి ఏంటి ఇది అని నవ్వాడు చైతన్య. ఈ ఎపిసోడ్ ఆహా లో ఆదివారం 9 గంటలకు ప్రసారం కానుంది. ఇక లవ్ స్టోరీ సినిమా విడుదల పోస్ట్ పోన్ అంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. అసలు ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీ చేయనున్నట్లు తెలిపింది. ఇక ఈ సినిమా విడుదలను వాయిదా చేయనున్నట్లు ఈ సిని నిర్మాత తెలుపగా.. మే 7న ఈ సినిమా విడుదల కానుందని సినీ బృందం అధికారిక ప్రకటన చేసింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.